భారత జట్టులో తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నలుగురు ఆటగాళ్లు ఈ ఐపీఎల్ లో( IPL ) యువకులకు పోటీగా తమ సత్తాను కొనసాగిస్తున్నారు.వీటి ఆట ప్రదర్శన అభిమానులతో పాటు క్రికెట్ నిపుణులకు సైతం ఆశ్చర్యపరుస్తోంది.
సాధారణంగా టీ20 ఫార్మాట్, టెస్ట్ ఫార్మాట్ లు చాలా డిఫరెంట్ గా ఉంటాయి.టీ 20 మ్యాచ్లలో బ్యాటర్లు వేగంగా పరుగులు చేస్తే.బౌలర్లు వేగంగా వికెట్లు తీయాలి.టెస్ట్ మ్యాచ్లో అయితే బౌలర్లు పరుగులు ఇవ్వకుండా బ్యాటర్లను కట్టడి చేయాలి.
బ్యాటర్లు ఎక్కువసేపు క్రీజు లో నిలబడి పరుగులు చేస్తూ ఉండాలి.కాబట్టి ఈ రెండు ఫార్మాట్లలో రాణించే ఆటగాళ్లు చాలా తక్కువ.
కానీ టెస్ట్ ఫార్మాట్ అయినా, టీ 20 ఫార్మాట్ అయిన తగ్గేదేలే అంటూ అద్భుత ఆటను ప్రదర్శిస్తున్న భారత జట్టు ఆటగాళ్లు ఎవరో చూద్దాం.

అజింక్యా రహానే:
టెస్ట్ క్రికెట్ ఫార్మాట్లో స్పెషలిస్ట్ గా రహానే కు( Rahane ) ప్రత్యేక గుర్తింపు ఉంది.ఇతను 82 టెస్ట్ మ్యాచ్లలో 4931 పరుగులు చేశాడు.ఈ ఐపీఎల్ 2023లో చెన్నై జట్టు తరఫున ఆడిన ఏడు మ్యాచ్లలో 44.80 సగటుతో 189.83 స్ట్రైక్ రేటుతో 254 పరుగులు చేశాడు.ఐపీఎల్ చరిత్రలో ఇతను రెండు సెంచరీలు, 30 అర్థ సెంచరీలు చేశాడు.

ఇషాంత్ శర్మ:
టెస్ట్ క్రికెట్ ఫార్మాట్లో స్పెషలిస్ట్ బౌలర్గా గుర్తింపు తెచ్చుకున్నాడు.అయితే కొంతకాలంగా టెస్ట్ సిరీస్ కు అయినప్పటికీ ఐపీఎల్ 2023లో అద్భుత ఆటను ప్రదర్శిస్తున్నాడు.ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఆడిన 4 మ్యాచ్లలో 6 వికెట్లు పడగొట్టాడు.ఇషాంత్( Ishant Sharma ) 97 ఐపీఎల్ మ్యాచ్లలో 8.03 ఎకనామీ తో 79 వికెట్లు తీశాడు.

రవిచంద్రన్ అశ్విన్:
ఇతనికి టెస్ట్ క్రికెట్ స్పెషలిస్ట్ స్పిన్నర్ గా ప్రత్యేక గుర్తింపు ఉంది.ఈ ఐపీఎల్ 2023 లో రాజస్థాన్ తరపున ఆడుతూ 9 మ్యాచులలో 13 వికెట్లు తీశాడు.అంతేకాకుండా ఈ తొమ్మిది మ్యాచ్లలో బ్యాటింగ్ చేసి 65 పరుగులు చేశాడు.అశ్విన్ ఐపీఎల్ లో 6.99 ఎకనామీతో 193 మ్యాచ్లలో 170 వికెట్లు తీశాడు.

మహమ్మద్ షమీ:
ఇతను టీ20, వన్డే, టెస్ట్ ఫార్మాట్ లలో నిపుణుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు.ఈ ఐపీఎల్ 2023లో గుజరాత్ తరపున ఆడుతూ 9 మ్యాచ్లలో 17 వికెట్లు తీశాడు.ఈ సీజన్లో ఇప్పటివరకు అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా షమీ ( Shami ) నిలిచి, పర్పుల్ క్యాప్ రేసులో అగ్రస్థానంలో ఉన్నాడు.
ఇతను ఐపీఎల్ లో 102 మ్యాచ్లలో 116 వికెట్లు తీశాడు.