ఆటో నడుపుకో అన్నారు.. ఒకే ఓవర్లో నాలుగు వికెట్లు తీశాడు.. భారతీయ క్రికెటర్ సిరాజ్ సక్సెస్ స్టోరీ ఇదే!

సక్సెస్ సాధించిన ప్రతి వ్యక్తి సక్సెస్ వెనుక ఎన్నో కష్టాలు, ఎన్నో అవమానాలు ఉంటాయి.భారతీయ బౌలర్ మహ్మద్ సిరాజ్ సక్సెస్ స్టోరీ( Indian Bowler Mohammed Siraj ) ఎంతోమందికి స్పూర్తిగా నిలుస్తుందని చెప్పవచ్చు.

 Indian Cricketer Mohammad Siraj Success Story Details Here Goes Viral In Social-TeluguStop.com

ఒకే ఓవర్లో నాలుగు వికెట్లు తీసిన ఏకైక భారతీయ బౌలర్ గా సిరాజ్ కు గుర్తింపు ఉంది.ఏడో తరగతి నుంచి తాను స్కూల్ జట్టు తరపున ఆడేవాడినని మొదట బ్యాటర్ నని పదో తరగతిలో చేరిన తర్వాత బౌలర్ అయ్యానని ఆయన వెల్లడించారు.

Telugu Indiancricketer, Mohammad Siraj, Mohammadsiraj, Sun Risers-Latest News -

పదో తరగతి తర్వాత చదువు ఆపేశానని ఇంటి దగ్గర ఉండే గ్రౌండ్ లో రోజూ టెన్నీస్ బాల్ మ్యాచ్ లు( Tennis Ball Matches ) ఆడేవాడినని ఆయన పేర్కొన్నారు.అన్నయ్య బీటెక్ చదువుతుంటే నేను ఆటలు ఆడేవాడినని అమ్మ కోప్పడేదని సిరాజ్ చెప్పుకొచ్చారు.నాన్న ఆటో నడపగా వచ్చిన డబ్బుతో పాకెట్ మనీ ఇచ్చేవారని సిరాజ్ కామెంట్లు చేశారు.మా మామయ్యకు క్రికెట్ క్లబ్ ఉండేదని నేను ఒక మ్యాచ్ లో తొమ్మిది వికెట్లు తీయడంతో మామయ ప్రోత్సహించారని సిరాజ్ అన్నారు.
ఆ మ్యాచ్ కు నేను 500 రూపాయలు తీసుకున్నానని సిరాజ్ కామెంట్లు చేశారు.అండర్ 23 హైదరాబాద్ జట్టుకు ఎంపికయ్యానని 2016 సంవత్సరంలో ఐపీఎల్ మ్యాచ్ కు నెట్ బౌలర్ గా పని చేశానని మహ్మద్ సిరాజ్ కామెంట్లు చేశారు.హైదరాబాద్ రంజీ జట్టుకు కోచ్ గా వెళ్లిన సమయంలో 45 వికెట్లు తీశానని సిరాజ్ అన్నారు.2017 ఐపీఎల్ సీజన్ సమయంలో సన్ రైజర్స్ జట్టు( Sun Risers Team ) 2.6 కోట్లకు నన్ను కొనుగోలు చేసిందని సిరాజ్ పేర్కొన్నారు.

Telugu Indiancricketer, Mohammad Siraj, Mohammadsiraj, Sun Risers-Latest News -

క్రికెటర్ అయితే అమ్మానాన్నలకు మంచి లైఫ్ ఇవ్వాలని నేను అనుకున్నానని సిరాజ్ చెప్పుకొచ్చారు.నా సక్సెస్ ను పూర్తిగా చూడకుండానే నాన్న మరణించాడని ఆయన కామెంట్లు చేశారు.నాన్న చనిపోయిన సమయంలో ఆస్ట్రేలియా( Austrailia Match )లో ఉన్నానని మ్యాచ్ మధ్యలోనే వదిలిరావడం ఇష్టం లేక జట్టులో కొనసాగానని సిరాజ్ అన్నారు.

నాన్న లేరన్న బాధ ఇప్పటికీ ఉందని ఆయన తెలిపారు.ఆటో నడుపుకో అంటూ కొన్నిసార్లు తనకు అవమానాలు ఎదురయ్యాయని ఆయన తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube