కడక్‌నాథ్ రూస్టర్ పెంపకం (కడక్‌నాథ్ కోడి) సంపాదనకు ఉత్తమ మార్గం.కడక్‌నాథ్ కోడి మాంసం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు.
భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ కడక్‌నాథ్ కోళ్ల వ్యాపారాన్ని ప్రారంభించారు.కడక్‌నాథ్ కోడిపిల్ల ధర దాదాపు రూ.200-300 మధ్య ఉంటుంది.కిలో చికెన్ రూ.1500 వరకు విక్రయమవుతుంది.ఈ కోడి మాంసంలో కొలెస్ట్రాల్ పరిమాణం కూడా చాలా తక్కువగా ఉంటుంది.
మాంసంతో పాటు కడక్‌నాథ్ కోడి గుడ్ల ద్వారా కూడా ఆదాయం సమకూరుతుంది.
గుడ్డు రేటు గురించి చెప్పాలంటే 20 నుంచి 30 రూపాయలకు అమ్ముడవుతుంది.
ఈ కోళ్ల వ్యాపారానికి పౌల్ట్రీ ఫారమ్‌ను ప్రారంభించాలి.దానిలో ఉష్ణోగ్రత, వెలుతురు, ఆహారం, నీటి కోసం ఏర్పాట్లు చేయాలి.
క్రికెట్ నుంచి రిటైరైన తర్వాత మహేంద్ర సింగ్ ధోనీ సేంద్రీయ వ్యవసాయం, కోళ్ల పెంపకం చేపట్టారు.ధోనీకి పెద్ద ఫామ్ హౌస్ ఉంది.
అక్కడ ఆయన కడక్‌నాథ్ కోళ్ల వ్యాపారం చేపట్టారు.ధోనీ కడక్‌నాథ్ కోల్ల వ్యాపారం చేపట్టేందుకు రెండు వేలకు పైగా కడక్‌నాథ్ కోళ్లను ఆర్డర్ చేశారు.
దాదాపు ఒక నెల తర్వాత ధోనీ ఫారానికి ఈ కోడిపిల్లలు వచ్చిచేరాయి.ధోనీ మధ్యప్రదేశ్‌లోని ఝబువా జిల్లా నుంచి కడక్‌నాథ్ కోడిపిల్లలను ఆర్డర్ చేశారు.







