ఇండియన్ ఆర్మీ కోసం అద్భుతమైన ఇంటి నిర్మాణం... ఒక్క బటన్‌ నొక్కితే చాలు ఇల్లు రెడీ!

ప్రస్తుతం వున్న కాస్ట్ అఫ్ లివింగ్లో ఇల్లు కట్టడమంటే అంత తేలికైన విషయం కాదు.స్థలం ఉంటే ఒకే గాని, స్థలం గాని లేకపోతే ఇక మామ్మూలుగా ఉండదు.

 Indian Army Inaugurates First Ever 3d Printed House Dwelling Unit,indian Army,ar-TeluguStop.com

వ్యయం డబల్ అవుతుంది.సిమెంట్‌ నుండి ఇటుకలు, ఐరెన్, కాంక్రీట్, సీలింగ్, పెయింటింగ్ వరకు లక్షల్లో పని.ఇక కూలీల సంగతి సరేసరి.పోనీ మొత్తంగా కాంట్రాక్టర్ ఇచ్చేద్దాం అంటే ఎవరు బాగా కడతారు? మంచి పనివాళ్లు దొరుకుతారో లేదో! ఇలా ఎన్నో డౌట్లు వస్తాయి.అయితే ఇపుడు అంత తలనొప్పి అవసరం లేదని చెబుతున్నారు నిపుణులు.

అవును, లేటెస్ట్‌ 3డీ ప్రింటింగ్ టెక్నాలజీని వాడుకొని ఏమాత్రం టెన్షన్‌ లేకుండా ఇల్లును చకచకా కట్టేయొచ్చని చెబుతున్నారు.

ఇక ఒకే ఒక్క బటన్ ప్రెస్ చేస్తే చాలు ఇల్లు రెడీ అయిపోతుందని లేటెస్ట్‌ త్రీ డైమెన్షనల్‌ ప్రింటింగ్ టెక్నాలజీ అంటోంది.జస్ట్‌ కొన్ని వారాల్లోనే ఇల్లు రెడీ చేసేస్తోంది ఈ న్యూ త్రీ డీ టెక్నాలజీ. ఈ టెక్నాలజీకి ఇటుకలతో, మేస్త్రీలతో పని లేదు.కేవలం ఇంటి స్థలం ఉంటే చాలు.

రోబోల మాదిరిగా రోజుల్లోనే ఇంటిని కట్టిపడేస్తోందీ ఈ 3డీ టెక్నాలజీ.ఇల్లు ఎలా కావాలో డిజైన్‌ చేసి, అన్నీ ఓకే అనుకుంటే.

జస్ట్ బటన్‌ నొక్కితే సరిపోతుంది….ఇంటి నిర్మాణం దానంతట అదే మొదలైపోతుంది.

Telugu Unit, Design, Indian, Soldiers-Latest News - Telugu

ఇదేదో సినిమా కధలా ఉందని అనుకోవద్దు.నిజం, ఇండియన్‌ ఆర్మీ సైనిక అవసరాల కోసం ఓ మోడల్‌ త్రీడీ హౌస్‌ను నిర్మించింది.71 చదరపు మీటర్ల విస్తీర్ణంలో కేవలం 12 వారాల్లోనే G ప్లస్‌ వన్‌ హౌస్‌ను నిర్మించింది ఆర్మీ.అహ్మదాబాద్ కంటోన్మెంట్‌లో నిర్మించిన ఈ త్రీడీ హౌస్‌ని చూసి స్థానికులు ఆశ్చర్యపోతున్నారు.

పార్కింగ్‌, గ్యారేజ్‌, స్టెయిర్‌ కేస్‌లతో సహా చాలా కట్టుదిట్టంగా అండ్‌ సింపుల్‌గా మోడ్రన్‌ హౌస్‌ నిర్మాణం రెడీ అయిపోయింది.ఇంకో విషయం ఏమంటే, భూకంపాలను కూడా తట్టుకునేంత పటిష్టంగా.

పర్యావరణ హితమైన మెటీరియల్స్‌తో అత్యాధునిక టెక్నాలజీతో నిర్మించారట ఈ బిల్డింగ్‌ని.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube