న్యూయార్క్: ఆడమ్స్ జట్టులో మరో ఇండో అమెరికన్.. పర్యావరణ పరిరక్షణ బాధ్యతలు ఆయనవే..!

ఇటీవల న్యూయార్క్ కొత్త మేయర్‌గా బాధ్యతలు స్వీకరించిన ఎరిక్ ఆడమ్స్ తన మార్క్ చూపిస్తున్నారు.నగర పోలీస్ కమీషనర్‌గా తొలిసారి మహిళను నియమించిన ఆయన.

తన జట్టులో నిపుణులు, సమర్ధులైన వారికి చోటు కల్పిస్తున్నారు.వీరిలో భారత సంతతి వారు కూడా వున్నారు.

తాజాగా న్యూయార్క్ క్లైమేట్ లీడర్‌షిప్ బృందానికి చీఫ్‌గా ఇండో అమెరికన్ పర్యావరణవేత్త రోహిత్ టి అగర్వాలాను నియమించారు.పట్టణ స్థిరీకరణ, సాంకేతికత తదితర అంశాలపై రోహిత్‌కు మంచి అనుభవం వుంది.

ఈ కారణం చేత న్యూయార్క్ సిటీ డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎన్విరాన్‌మెంటల్ ప్రొటెక్షన్ (డీఈపీ) చీఫ్ క్లైమేట్ ఆఫీసర్, కమీషనర్‌గా రోహిత్‌ను నియమించారు ఆడమ్స్.కాగా.

Advertisement

ఆఫీస్ ఆఫ్ క్లైమేట్ అండ్ ఎన్విరాన్‌మెంటల్ జస్టిస్‌ (ఎంవోసీఈజే)ను ఏర్పాటు చేస్తున్నట్లు న్యూయార్క్ మేయర్ ఎరిక్ ఆడమ్స్ జనవరి 31న ప్రకటించారు.చెప్పినట్లుగా.

కిజ్జీ చార్లెస్ గుజ్‌మాన్ నేతృత్వంలో నగరంలోని ఏజెన్సీలను ఏకీకృతం చేశారు.ఈ క్రమంలో ఆమె తన చర్యలపై నేరుగా చీఫ్ క్లైమేట్ ఆఫీసర్ రోహిత్‌ అగర్వాలాకు రిపోర్ట్ చేయనున్నారు.

ఇక రోహిత్ విషయానికి వస్తే.మైఖేల్ ఆర్ బ్లూమ్‌బెర్గ్ న్యూయార్క్ మేయర్‌గా వున్న కాలంలో లాంగ్ టర్మ్ ప్లానింగ్ అండ్ సస్టైనబిలిటీకి సంబంధించిన ప్రణాళికలను ఆయనే రూపొందించారు.సీ40 సిటీస్ క్లైమేట్ లీడర్‌షిప్ గ్రూప్ డైరెక్టర్ల బోర్డు అధ్యక్షుడిగానూ వ్యవహరించారు.సైడ్‌వాక్ ల్యాబ్స్‌ వ్యవస్థాపక బృందంలో సభ్యుడిగా, జాకబ్స్ కార్నెల్ టెక్నియన్ ఇన్‌స్టిట్యూట్‌లో సీనియర్ అర్బన్ టెక్ ఫెలోగానూ రోహిత్ విధులు నిర్వర్తించారు.

కొలంబియా విశ్వవిద్యాలయం నుంచి పీహెచ్‌డీ, ఎంబీ, బీఏ పట్టాలను అందుకున్న ఆయన.అంటారియోలోని క్వీన్స్‌ యూనివర్సిటీ నుంచి ఎంఏ పూర్తి చేశారు.

ఘట్టమనేని వారి వివాహ ఆహ్వానం... వైరల్ అవుతున్న వెడ్డింగ్ కార్డ్!
వీడియో వైరల్‌ : కారుతో పెట్రోల్‌ పంప్‌ ఉద్యోగిపైకి దూసుకెళ్లిన పోలీసు..

ఇప్పటికే అత్యంత కీలకమైన న్యూయార్క్ సిటీ చీఫ్ హెల్త్ ఆఫీసర్‌గా భారత సంతతికి చెందిన దేవ్ చోక్షీని , సీనియర్ పబ్లిక్ హెల్త్ అడ్వైజర్‌గా అశ్విన్ వాసన్‌ను ఎరిక్ ఆడమ్స్ నియమించిన సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు