పెద్దలకు తాము ఏ మాత్రం తక్కువ కాదని నిరూపిస్తున్నారు అమెరికాలోని భారత సంతతి చిన్నారులు.చదువు, ఆటపాటలు సహా పలు అంశాల్లో ప్రతిభ చూపుతూ తల్లిదండ్రులకు, దేశానికి పేరు తీసుకొస్తున్నారు.
తాజాగా ఇండో అమెరికన్ బాలిక నటాషా పేరి (11 ) రికార్డు సృష్టించింది.ప్రపంచంలోనే అత్యంత తెలివైన విద్యార్థినిగా ఆమె బ్రైటెస్ట్ స్టూడెంట్స్ లిస్టులో స్థానం సంపాదించింది.84 దేశాలకు చెందిన సుమారు 19 వేల మంది విద్యార్థులు పాల్గొన్న పరీక్షలో ఆమె అగ్రస్థానంలో నిలిచింది.
అమెరికా మేరీల్యాండ్‌లో ఉన్న జాన్స్ హాప్కిన్స్ వర్సిటీలోని జాన్స్ హాప్కిన్స్ సెంటర్ ఫర్ టాలెంటెడ్ యూత్ టాలెంట్ (సీటీవై)లో టెస్టులో నటాషా ఈ ఘనత సాధించింది.
చురుకుగా ఉన్న విద్యార్థుల్లో అకాడమిక్ సామర్థ్యాన్ని పరీక్షించేందుకు సీటీవై పరీక్షలు నిర్వహిస్తుంటారు.సాండ్‌మేయర్ ఎలిమెంటరీ స్కూల్‌లో నటాషా చదువుకుంటోంది.సీటీవై ట్యాలెంట్ పరీక్షలో భాగంగా నిర్వహించిన ఎస్ఏటీ, ఏసీటీ పరీక్షల్లో నటాషా అత్యుద్భుత ప్రదర్శన ఇచ్చింది.అయిదవ గ్రేడ్ చదువువుతున్న ఆ విద్యార్థిని.
వెర్బల్, క్వాంటిటేటివ్ సెక్షన్‌లో.గ్రేడ్ 8 పర్ఫార్మెన్స్‌ను ప్రదర్శించింది.90 శాతానికి పైగా మార్కులు సాధించి నిర్వాహకులను సైతం ఆశ్చర్యానికి గురి చేసింది నటాషా.తద్వారా సీటీవై ఇచ్చే హై హానర్స్ అవార్డుకు ఈ చిన్నారి ఎంపికైంది.
పోటీలో విజయం తర్వాత నటాషా స్పందిస్తూ.తాను మరింత స్ఫూర్తి పొందానని, భవిష్యత్ లో మరిన్ని సాధిస్తానని ధీమా వ్యక్తం చేసింది.గూగుల్ సెర్చ్, జేఆర్ఆర్ టోకీన్స్ నవలలు తనకు ఎంతో ఉపయోగపడ్డాయని తెలిపింది.కాగా, అమెరికాలోని 50 రాష్ట్రాల నుంచి విద్యార్థులను ఈ అవార్డుకు ఎంపిక చేశారు.
నేర్చుకోవాలనే చిన్నారుల తాపత్రయం చాలా ముచ్చటగా ఉందని సీటీవై ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వర్జీనియా రోచ్ చెప్పారు.చిన్నారుల స్కూల్, కాలేజ్, ఉన్నత చదువుల్లో ఎదిగేందుకు మరింత సహకారం అందిస్తామని రోచ్ పేర్కొన్నారు.

సీటీవై టాలెంట్ సెర్చ్‌లో పాల్గొన్నవారిలో 20 శాతం కంటే తక్కువ మంది సీటీవై హై ఆనర్స్ అవార్డులకు అర్హత సాధించారు.వీరంతా సీటీవై ఆన్‌లైన్ , సమ్మర్ ప్రోగ్రామ్‌లకు కూడా అర్హత సాధించినట్లు నిర్వాహకులు తెలిపారు.సీటీవై ఆన్‌లైన్ ప్రోగ్రామ్స్ కోర్సులలో ప్రతి ఏడాది 15,500 కంటే ఎక్కువ ఎన్‌రోల్‌మెంట్స్ నమోదవుతూ వుంటాయి.దీనికి అదనంగా ప్రతిభావంతులైన విద్యార్ధుల కోసం సీటీవై సమ్మర్ ప్రోగ్రామ్స్ అమెరికాతో పాటు హాంకాంగ్‌లలోని సుమారు 20 చోట్ల అందిస్తున్నారు.