న్యూయార్క్: క్వీన్స్ సిటీ కౌన్సిల్ ఎన్నికల్లో భారత సంతతి మహిళ ... రిపబ్లికన్లతో టఫ్ ఫైట్

అమెరికా రాజకీయాల్లో భారత సంతతి ప్రజలు దూసుకెళ్తున్న సంగతి తెలిసిందే.ఇప్పటికే దేశంలో రెండో అత్యున్నత పదవిని దక్కించుకున్న చరిత్ర ఇండో అమెరికన్లది.

ఇక సెనేటర్లుగా, కాంగ్రెస్ సభ్యులుగా, గవర్నర్లుగా ఇతర కీలక పదవుల్లోనూ భారతీయులు కొనసాగుతున్నారు.అటు స్థానిక సంస్థల్లోనూ మేయర్లుగా, కౌన్సిల్ సభ్యులుగా సత్తా చాటుతున్నారు.

తాజాగా న్యూయార్క్‌కు సమీపంలోని క్వీన్స్ సిటీ కౌన్సిల్‌లో 32వ జిల్లా నుంచి భారత సంతతికి చెందిన మహిళ ఫెలిసియా సింగ్ సత్తా చాటుతున్నారు.ఈ నేపథ్యంలో తాజాగా డెమొక్రాటిక్ ప్రైమరీలో విజయం సాధించారు.

ఉపాధ్యాయ, మధ్య తరగతి కార్మిక వలసదారుల కుమార్తె అయిన ఫెలిసియా సింగ్.న్యూయార్క్ నగరంలో ఎప్పటి నుంచో నివసిస్తున్నారు.

Advertisement

రిపబ్లికన్ల గుప్పిట్లో వున్న క్వీన్స్‌ సిటీ కౌన్సిల్ సీటును డెమొక్రాట్ల తరపున గెలవాలని ఫెలిసియా భావిస్తున్నారు.నవంబర్ 2న జరగనున్న ఎన్నికల్లో జోన్ అరియోలాతో తలపడనున్నారు.

క్వీన్స్ 32వ జిల్లా రాక్‌వే ద్వీపకల్పం, హోవార్డ్ బీచ్, బెల్లె హార్బర్, వుడ్‌హెవెన్, సౌత్ ఓజోన్ పార్క్‌ల పరిధిలో విస్తరించి వుంది.సెన్సస్ డేటా ప్రకారం.

క్వీన్స్‌లో ఇండో కరేబియన్, లాటిన్, పంజాబీ, బంగ్లాదేశ్ కమ్యూనిటీలలో వృద్ధి నమోదైంది.ఇక్కడి నుంచి ఫెలిసియా ఎంపికైతే జిల్లాకు ప్రాతినిధ్యం వహించిన తొలి మహిళగా ఆమె రికార్డుల్లోకెక్కుతారు.

క్వీన్స్‌లో రిపబ్లికన్‌ల కంటే డెమొక్రాట్లు ఎక్కువగా వున్నారు.బరో అంతటా ఈ పార్టీకి 8,07,187 మంది క్రియాశీల సభ్యులు వున్నారు.

ఇదేందయ్యా ఇది.. బాయ్‌ఫ్రెండ్‌పై కోపంతో ఇలా కూడా చేస్తారా..??
అందివచ్చిన అవకాశాన్ని ఈ ఇద్దరు హీరోయిన్స్ ఉపయోగించుకుంటారా ?

ఇక కౌన్సిల్‌లో మొట్టమొదటి దక్షిణాసియా ప్రతినిధిగా పోటిలో నిలిచిన ఫెలిసియా సింగ్.ఓజోన్ పార్క్‌లో 74,965 డాలర్లను విరాళాల రూపంలో సేకరించగా.

Advertisement

రిపబ్లికన్ అభ్యర్ది అరియోలాలో 43,231 డాలర్లు సేకరించారు.సామాజిక సేవ, యువత అభివృద్ధి, నివసించడానికి సురక్షితమైన స్థలాన్ని ఇచ్చేందుకు గాను ఎన్‌వైపీడీ నుంచి 1 బిలియన్ డాలర్ల నిధులను ఫెలిసియా డిమాండ్ చేస్తున్నారు.

మరోవైపు అరియోలా మాట్లాడుతూ.ప్రజాభద్రత జిల్లా ఎదుర్కొంటున్న ముఖ్యమైన సమస్యలలో ఒకటి అన్నారు.

అలాగే క్వీన్స్‌ సిటీలో నివసించే చట్టబద్ధమైన శాశ్వత నివాసితులకు మున్సిపల్ ఓటింగ్ హక్కులకు కల్పించాలన్న ఫెలిసియా వాదనను అరియోలా ఖండించారు.అంతేకాదు ఆమెను ‘‘రాడికల్’’ అంటూ వ్యాఖ్యానించారు.

ఓటు అనేది పౌరసత్వంతో ముడిపడి వుండే పవిత్రమైన హక్కు అని అరియోలా కొద్దిరోజుల క్రితం అన్నారు.అయితే దీనికి ఫెలిసియా ధీటుగా బదులిచ్చారు.

తాజా వార్తలు