అమెరికా : లంచం , పన్ను ఎగవేత కేసులో భారత సంతతి వ్యాపారవేత్తకు శిక్ష

లంచం, పన్ను ఎగవేతకు పాల్పడినందుకు గాను భారతీయ అమెరికన్ వ్యాపారవేత్తకు( Indian-American Businessman ) 18 నెలల పరిశీలన, 200 గంటల కమ్యూనిటీ సర్వీస్ శిక్ష విధించినట్లుగా న్యాయశాఖ తెలిపింది.అర్మాన్ అమీర్షాహి (46)( Arman Amirshahi ) మేరీలాండ్‌లోని క్యాపిటల్ హైట్స్‌కు చెందిన సహ కుట్రదారులు ఆంథోనీ మెరిట్, డీసీ ఆఫీస్ ఆఫ్ టాక్స్ అండ్ రెవెన్యూ (ఓటీఆర్)లో మాజీ మేనేజర్ విన్సెంట్ స్లేటర్ నేతృత్వంలో లంచం స్కామ్‌లలో( Bribery Scam ) పాలు పంచుకున్నాడు.

 Indian-american Businessman Sentenced For Bribery Tax Evasion Details, Indian-am-TeluguStop.com

స్కీమ్‌లలో భాగంగా.అమీర్‌షాహి, చార్లెస్ జౌ, ఆండ్రీ డి మోయా, దావూద్ జాఫారీలతో సహా నలుగురు వ్యాపార యజమానులు తమ వ్యాపార పన్నులను ఎగవేసేందుకు స్లేటర్‌కు మధ్యవర్తిగా నగదు చెల్లించారు.

డీసీ డిపార్ట్‌మెంట్ ఆఫ్ కన్స్యూమర్ అండ్ రెగ్యులేటరీ అఫైర్స్ మాజీ అధికారి అయిన మెరిట్ తనను తాను పర్మిట్, లైసెన్సింగ్ ఎక్స్‌పెడిటర్‌గా చెప్పుకుని వ్యాపారవేత్తలను ఈ పథకానికి పరిచయం చేశాడు.లంచం చెల్లింపుల్లో కోత కోసం.

వ్యాపారవేత్తలతో మెరిట్ కమ్యూనికేషన్‌ను నిర్వహించాడు.అలాగే వారి నగదు చెల్లింపులను స్లేటర్‌కి పంపించాడు.

తద్వారా స్లేటర్ మోసపూరితంగా వారి బాధ్యతలను తగ్గించడమో, ఓటీఆర్‌లో వారి తరపున జోక్యం చేసుకున్నందున వారికి దూరంగా వుండేవాడు.

Telugu Andre De Moya, Anthony Merritt, Arman Amirshahi, Bribery, Bribery Scam, C

అయితే స్లేటర్( Slater ) డిసెంబర్ 2017లో ఓటీఆర్ నుంచి వైదొలగడంతో పాటు స్కీమ్‌లను ముగించాడు.వీటిలో ప్రతి ఒక్కటి ఐదేళ్ల పాటు కొనసాగింది.వారి చర్యల ద్వారా సహ కుట్రదారులు డిస్ట్రిక్ట్ ఆఫ్ కొలంబియాకు( District Of Colombia ) దాదాపు 3 మిలియన్ డాలర్లు నష్టం కలిగించారు.

ఈ కేసుకు సంబంధించి ప్రతివాదులు దోషులుగా తేలారు.అమీర్‌షాహి, జౌలు వరుసగా జనవరి 2019లో, ఫిబ్రవరి 2019లలో లంచం తీసుకున్నట్లుగా నేరాన్ని అంగీకరించారు.2019లో స్లేటర్, డి మోయా, మెరిట్‌లపై నేరారోపణలను మోపారు.జూన్ 2020లో స్లేటర్ తన నేరాన్ని అంగీకరించాడు.

Telugu Andre De Moya, Anthony Merritt, Arman Amirshahi, Bribery, Bribery Scam, C

జూన్ 2023లో జ్యూరీ.డి మోయా,( De Moya ) మెరిట్‌లను( Merritt ) కుట్ర, లంచం, వైర్ మోసానికి పాల్పడినట్లుగా నిర్ధారించింది.సెప్టెంబర్ 2023లో మెరిట్ తనపై మోపిన రెండవ అభియోగాన్ని అంగీకరించాడు.గతేడాది అక్టోబర్‌లో కుట్ర, లంచం, వైర్ ఫ్రాండ్‌లో జాఫారీని జ్యూరీ దోషిగా నిర్ధారించింది.ప్రత్యేక కుట్రలను అమలు చేయడంలో కీలకపాత్ర పోషించినందుకు గాను మెరిట్‌కు 110 నెలల జైలు శిక్ష విధించారు.డి మోయాకు 30 నెలలు, స్లేటర్‌కు 27 నెలలు, జాఫారీకి 24 నెలలు శిక్ష విధించారు.

ఈ కేసులో ప్రభుత్వానికి సహకరించిన జౌకు ఐదేళ్ల ప్రొబేషన్ శిక్ష విధించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube