భారత్ పర్యటనలో ఇంగ్లాండ్ మహిళల క్రికెట్ జట్టు.. పూర్తి షెడ్యూల్ ఇదే..!

భారత్ పర్యటనలో భాగంగా భారత్ వర్సెస్ ఇంగ్లాండ్( India vs England ) మహిళల జట్ల మధ్య 3 మ్యాచ్ల టీ20 సిరీస్ తో పాటు ఒక టెస్టు మ్యాచ్ జరుగునుంది.

అందుకు సంబంధించిన పూర్తి షెడ్యూల్ వివరాలు ఏమిటో చూద్దాం.

ముంబైలోని వాఖండే స్టేడియం వేదికగా భారత్ వర్సెస్ ఇంగ్లాండ్ మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ రేపటి నుంచి ప్రారంభం అవ్వనుంది.హర్మన్ ప్రీత్ కౌర్( Harmanpreet Kaur ) సారధ్యంలో భారత జట్టు బరిలోకి దిగనుంది.

ఈ సిరీస్ లో భాగంగా డిసెంబర్ 6న మొదటి టీ20 మ్యాచ్, డిసెంబర్ 9న రెండవ టీ20 మ్యాచ్, డిసెంబర్ 10న మూడవ టీ20 మ్యాచ్ ముంబైలోని వాఖండే వేదికగా రాత్రి 7 గంటలకు జరుగనున్నాయి.

టీ20 సిరీస్ ఆడే భారత మహిళల జట్టు: హార్మన్ ప్రీత్ కౌర్(కెప్టెన్), స్మృతి మందాన (వైస్ కెప్టెన్),( Smriti Mandhana ) జెమీమా రోడ్రిగ్స్,( Jemimah Rodrigues ) షఫాలీ వర్మ, దీప్తి శర్మ, యాస్తికా భాటియా(వికెట్ కీపర్), రిచా ఘోష్(వికెట్ కీపర్), అమంజోత్ కౌర్, రాంకా పాటిల్, మన్నత్ కశ్యక్, సయికా ఇషాక్, రేణుక సింగ్ ఠాకూర్, టిటాస్ సాధు, పూజా వస్త్రాకర్, కనికా అహూజా, మిన్ను మణి.

Advertisement

డిసెంబర్ 14 నుంచి డిసెంబర్ 17 వరకు డివై పాటిల్ స్టేడియం వేదికగా టెస్ట్ మ్యాచ్ జరుగునుంది.ఈ మ్యాచ్ ఉదయం 9:30 గంటలకు ప్రారంభం అవ్వనుంది.టెస్ట్ మ్యాచ్ ఆడే భారత మహిళల జట్టు: హార్మన్ ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మందాన (వైస్ కెప్టెన్), జెమీమా రోడ్రిగ్స్, షఫాలీ వర్మ, దీప్తి శర్మ, యాస్తికా భాటియా (వికెట్ కీపర్) రిచా ఘోష్ (వికెట్ కీపర్), స్నేహ రాణా, శుభా సతీష్, హర్లీన్ డియోల్, రేణుక సింగ్ ఠాకూర్, టిటాస్ సాధు, పూజా వస్త్రాకర్, మేఘనా సింగ్.ఈ మ్యాచ్లను జియో, ఫ్యాన్ కోడ్ యాప్, వెబ్సైట్లలో ప్రత్యక్ష ప్రసారం చూడవచ్చు.

స్పోర్ట్స్ 18 నెట్వర్క్ ఛానల్ లో ఈ మ్యాచ్లను ప్రత్యక్షంగా వీక్షించవచ్చు.

Advertisement

తాజా వార్తలు