టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్.. టీం వివరాలు ఇలా.!

రోహిత్ శర్మ( Rohit Sharma ) నేతృత్వంలోని భారత క్రికెట్ జట్టు, నజ్ముల్ హుస్సేన్ శాంటో( Nazmul Hossain Shanto ) నేతృత్వంలోని బంగ్లాదేశ్ జట్టు మధ్య నేటి (సెప్టెంబర్ 27) నుండి కాన్పూర్‌లోని గ్రీన్‌పార్క్ స్టేడియంలో రెండో టెస్ట్ మ్యాచ్ జరగనుంది.

ఈ మ్యాచ్‌లో భారత కెప్టెన్ రోహిత్ శర్మ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు.

రోహిత్ శర్మ సారథ్యంలో బంగ్లాదేశ్‌తో( Bangladesh ) జరిగిన చెన్నై టెస్టు మ్యాచ్‌లో టీమిండియా 280 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.ఇక ఈ మ్యాచ్ లో భారత జట్టులో ఎలాంటి మార్పు లేదు.

వర్షంతో మైదానం తడిసిపోవడంతో టాస్‌ ఆలస్యమైంది.గ్రీన్ పార్క్ స్టేడియం వేదికగా జరగనున్న ఈ మ్యాచ్‌లో అతిధులను క్లీన్ స్వీప్ తో తుడిచిపెట్టేయాలని టీమిండియా( Team India ) ఉవ్విళ్లూరుతోంది.రెండో టెస్టులో విజయం సాధించడం ద్వారా ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ పాయింట్ల పట్టికలో తన నంబర్-1 స్థానాన్ని మరింత పటిష్టం చేసుకోవాలని టీమిండియా ఉవ్విళ్లూరుతోంది.

అయితే, కాన్పూర్ టెస్టు తొలి మూడు రోజులు వర్షం కురిసే అవకాశాలు ఉన్నాయి.మరి ఈ వర్షం అభిమానుల మజాను పాడు చేస్తుందో లేదో చూడాలి మరి.

Advertisement

ఇండియా (ప్లేయింగ్ XI):

యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), KL రాహుల్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, ఆకాష్ దీప్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్.బంగ్లాదేశ్ (ప్లేయింగ్ XI): షాద్మాన్ ఇస్లాం, జకీర్ హసన్, నజ్ముల్ హొస్సేన్ శాంటో (సి), మోమినుల్ హక్, ముష్ఫికర్ రహీమ్, షకీబ్ అల్ హసన్, లిటన్ దాస్ (W), మెహదీ హసన్ మిరాజ్, తైజుల్ ఇస్లాం, హసన్ మహమూద్ , ఖలీద్ అహ్మద్.

పుత్రికోత్సాహంలో జగన్.. మమ్మల్ని ఎంతో గర్వపడేలా చేసావంటూ ట్వీట్
Advertisement

తాజా వార్తలు