ఇండియా Vs పాక్ మ్యాచ్: పాకిస్థాన్ యువతి మెడలో ఉన్నది చూసి అంతా షాక్..?

ప్రస్తుతం మెన్స్ టీ20 వరల్డ్ కప్ ( Men’s T20 World Cup )మ్యాచ్‌లు జరుగుతున్న సంగతి తెలిసిందే.ఇటీవల ఇండియా vs పాక్ మ్యాచ్ జరిగింది.

 India Vs Pakistan Match Pakistani Young Woman Shocked To See What Is On Her Nec-TeluguStop.com

ఈ మ్యాచ్ సమయంలో ఒక పాకిస్థాన్ క్రికెట్ అభిమాని తన మెడలో ఒక పెండెంట్ వేసుకొని వచ్చింది అది చాలామంది దృష్టిని ఆకర్షించింది.ఎందుకంటే ఆ పెండెంట్ టీమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లీది.

పాక్ ఫ్యాన్ అయినా ఇండియన్ క్రికెటర్ పట్ల ఆమె తన అభిమానాన్ని చాటి అందరి దృష్టిని ఆకర్షించింది.గత సంవత్సరం, ఆమె ఇండియా-పాకిస్తాన్‌ మధ్య జరిగిన మ్యాచ్‌లో కోహ్లీ సెంచరీ చేస్తారని ఆశించి శ్రీలంకకు వెళ్లింది.

కానీ, వర్షం కారణంగా ఆ మ్యాచ్ రద్దు అయింది.ఇటీవల, ఆమె భారత్-పాకిస్థాన్ మధ్య జరిగిన T20 ప్రపంచకప్ మ్యాచ్‌లో కనిపించింది.

ఈసారి, ఆమె కోహ్లీ ( Kohli )ఫోటోతో కూడిన నెక్లెస్, అతని జెర్సీ నంబర్ 18 ఉన్న నెక్లెస్ ధరించింది.ఆమె ఫోటో ఆన్‌లైన్‌లో వైరల్ అయింది, చాలా మంది దానిపై తమ అభిప్రాయాలను పంచుకున్నారు.కొందరు ఆమెను ప్రశంసించారు, మరికొందరు ఆమెపై కెమెరా దృష్టి పెట్టడంపై జోకులు చేశారు.పాకిస్థాన్‌కు చెందిన ఈ అమ్మాయి సోషల్ మీడియాలో “లవ్ ఖానీ” పేరుతో ఫేమస్ అయింది.

ఈ ముద్దుగుమ్మకు ఇన్‌స్టాగ్రామ్‌లో 22 లక్షలకు పైగా, టిక్‌టాక్‌లో 51 లక్షలకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు.

ఆమె అబుదాబిలో షాపింగ్ మాల్‌లో పనిచేస్తూ, అక్కడి ఆఫర్లు, ప్రొడక్ట్స్ గురించి షార్ట్ వీడియోలు చేస్తుంది.నిజానికి ఆమె పేరు ఫిజా ఖాన్( Fiza Khan ) అని అంటారు.టిక్‌టాక్‌కే కాకుండా ఫ్యాషన్ మోడల్, బ్లాగర్, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయన్సర్‌గా కూడా గుర్తింపు పొందింది.

కింగ్ కోహ్లీ విరాట్ కోహ్లీపై ఆమె అభిమానం అందరికీ తెలిసిందే.గతేడాది ఆసియా కప్ సమయంలో పాకిస్తాన్, భారత్ జట్లు రెండింటినీ ఆదరిస్తానని వీడియోలో చెప్పింది.

అంతేకాకుండా రెండు దేశాల జెండాలు ముఖంపై వేసుకుని మద్దతు తెలిపించింది.పాకిస్తాన్ జట్టు కెప్టెన్ బాబర్ ఆజామ్‌ కంటే విరాట్ కోహ్లీనే తనకు ఇష్టం అని ఆమె చెప్పింది.

అతను తన ఫేవరెట్ ప్లేయర్ అని, ఆయన ఆట చూసేందుకే ప్రయాణం చేశానని చెప్పింది.వర్షం కారణంగా కోహ్లీ ఆడకపోవడంతో చాలా బాధపడిందట.

భారత జట్టును కాదని కేవలం కోహ్లీనే అభిమానించడం ఏం తప్పు కాదని ఓ వ్యాఖ్యకు సమాధానం ఇచ్చింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube