అమెరికాలోని ‘‘స్థానిక’’ ప్రభుత్వాలపై ఫోకస్.. గవర్నర్‌లు, మేయర్‌లతో భారత రాయబారి తరణ్‌జిత్ భేటీ

అమెరికాలో భారత రాయబారిగా వున్న తరణ్‌జిత్ సింగ్ సంధూ . ఇరు దేశాల మధ్య సంబంధాలను మరింత బలపరిచేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు.

వీలున్నప్పుడల్లా అక్కడి అధికారులు, దౌత్యవేత్తలతో సమావేశమవుతూ అమెరికాలోని భారతీయులకు తాను వున్నాననే భరోసా కల్పిస్తూ వుంటారు.ఈ నేపథ్యంలో తాజాగా అమెరికాలోని స్థానిక ప్రభుత్వాలు, వ్యక్తులతో సంబంధాలను పెంపొందించేందుకు గాను అక్కడి మేయర్‌లు, గవర్నర్‌లతో సంధూ చర్చలకు సిద్ధమయ్యారు.

జాతీయ, అంతర్జాతీయ రాజకీయాల్లో న్యూయార్క్, లాస్ ఏంజిల్స్, చికాగో వంటి శక్తివంతమైన అమెరికా నగరాల నుంచి ఎన్నికైన ప్రతినిధుల ప్రాబల్యం పెరుగుతున్న నేపథ్యంలో భారత ప్రభుత్వం దీనిపై ఫోకస్ పెట్టింది.వీటికి బలం చేకూర్చేలా ఇటీవల లాస్ ఏంజెల్స్ నగర మేయర్ ఎరిక్ గార్సెట్టిని భారత్‌లో అమెరికా రాయబారిగా నియమించారు అధ్యక్షుడు జో బైడెన్.

ఈ పరిణామాల నేపథ్యంలో తరణ్‌జిత్ సింగ్ సంధూ.దేశంలోని ముగ్గురు ప్రముఖ మేయర్‌లను కలిసి సంప్రదింపులు జరిపారు.

Advertisement

ఇప్పటికే దేశంలోని 50 రాష్ట్రాల గవర్నర్‌లలో 40 మందిని సంధూ ఈ చర్చల్లో భాగం చేశారు.తాజాగా భారత దౌత్య మిషన్‌లను.

అమెరికాలోని స్థానిక పరిపాలనా యంత్రాంగాలకు చేరువ చేసేందుకు తరణ్‌జిత్ ప్రయత్నిస్తున్నారు.గత నెలలో ఆయన.ఇటీవల న్యూయార్క్ మేయర్‌గా ఎన్నికైన ఎరిక్ ఆడమ్స్‌ను కలిసి మంతనాలు జరిపారు.

న్యూయార్క్ నగర మేయర్‌గా చారిత్రాత్మక విజయం సాధించినందుకు ఎరిక్ ఆడమ్స్‌కు తరణ్‌జిత్ అభినందనలు తెలిపారు.ఈ సందర్భంగా ఇండో- యూఎస్ భాగస్వామ్యానికి, న్యూయార్క్‌లోని భారతీయ ప్రవాసులకు అందించిన మద్ధతుకు ఆయన ధన్యవాదాలు చెప్పారు.సరసమైన ఆరోగ్య సంరక్షణ, పునరుత్పాదక ఇంధనం, సాంకేతికత, విద్య, విజ్ఞాన భాగస్వామ్యం, ఐటీ, ఫిన్‌టెక్, స్పేస్ వంటి కీలక రంగాలకు సంబంధించి భారత్- న్యూయార్క్ నగరాల మధ్య భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడంపై తరణ్‌జిత్ సింగ్ సంధు, ఎరిక్ ఆడమ్స్ చర్చలు జరిపారు.

వారికి గాజు గ్లాస్ గుర్తు.. కోర్టుకెక్కిన జనసేన 
Advertisement

తాజా వార్తలు