కరోనా వైరస్ దేశంలో ఎంత అల్ల కల్లోలం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.ఎంతో మంది కరోనా బారిన పడి ప్రాణాలు సైతం కోల్పోయారు.
సినీ నటులతో సహా క్రీడాకారులు కూడా కరోనా బారిన పడుతున్నారు.ఇప్పుడు ఇండియా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీ- 2022లో కొవిడ్-19 కలకలం రేపింది.
భారత్ కు చెందిన ఏడుగురు బ్యాడ్మింటన్ ఆటగాళ్లకు కరోనా సోకింది.అందుకనే వారు ఈ టోర్నీలో పాల్గొనడం లేదని ప్రపంచ బ్యాడ్మింటన్ ఫెడరేషన్ తెలిపింది.
గురువారం తెల్లవారుజామున బీడబ్ల్యూఎఫ్ ఒక ప్రకటనలో ఈ విషయాన్ని తెలిపింది.కరోనా వైరస్ బారిన పడ్డ వారిలో ఎవరెవరు ఉన్నారంటే.
కిదాంబి శ్రీకాంత్, అశ్విని పొన్నప్ప, సిమ్రాన్ అమన్ సింగ్, రిథికా రాహుల్, మిథున్ మంజునాథ్, థెరిసా జాలీ, కుషి గుప్తాలు ఉన్నారు.టోర్నిలో పాల్గొన్న ఆటగాళ్లకు మంగళవారం నిర్వహించిన ఆర్టీ- పీసీఆర్ పరీక్షలో ఏడుగురు ఆటగాళ్లకు పాజిటివ్ గా వచ్చింది.