మరో సూపర్‌ ఓవర్‌ : ఉత్కంఠపోరులో ఇండియా అద్బుత విజయం

మొన్నటి వరకు సొంత గడ్డపై ప్రత్యర్థులకు చుక్కలు చూపించిన టీం ఇండియా యువ కెరటాలు ప్రస్తుతం న్యూజిలాండ్‌ గడ్డపై వారికి చుక్కలు చూపిస్తున్నాయి.పిచ్‌ ఏదైనా.

దేశం ఏదైనా.ప్రత్యర్థి ఎవరైనా అన్నట్లుగా టీం ఇండియా దూకుడు కొనసాగుతుంది.

విజయం మాత్రమే మరో ఆలోచన లేకుండా టీం ఇండియా విజయాల పరంపర కొనసాగుతూ వస్తుంది.ఇప్పటికే మూడు టీ20లు గెలిచి సిరీస్‌ను గెలిచిన టీం ఇండియా నాల్గవ టీ20ని కూడా గెలిచింది.

మూడవ టీ20ని సూపర్‌ ఓవర్‌తో గెలుచుకున్న టీం ఇండియా నాల్గవ టీ20ని కోల్పోవడం ఖాయం అనుకున్నారు.కాని అద్బుతమైన బౌలింగ్‌తో టీం ఇండియాకు ఈ మ్యాచ్‌ను కూడా బౌలర్లు కట్టబెట్టారు.

Advertisement

మూడవ మ్యాచ్‌ తరహాలోనే నాల్గవ మ్యాచ్‌ కూడా టై అవ్వడంతో సూపర్‌ ఆడారు.సూపర్‌ ఓవర్‌లో మొదట న్యూజీలాండ్‌ బ్యాటింగ్‌ చేసింది.13 పరుగులు చేసిన న్యూజిలాండ్‌ 14 పరుగుల లక్ష్యంను ఇండియాకు విధించింది.నేడు మ్యాచ్‌లో రోహిత్‌ లేని లేకపోడంతో కొందరు భయపడ్డారు.

కాని రోహిత్‌ లేని లోటును రాహుల్‌ భర్తీ చేశాడు.అద్బుతమైన షాట్స్‌ తో ఆరంభించాడు.

చివర్లో కోహ్లీ ముగించాడు.మొత్తానికి 4-0తో సిరీస్‌లో టీం ఇండియా ఆదిపత్యం కొనసాగుతుంది.

చివరి టీ20లో పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి.

నాగార్జున 100 వ సినిమా కథను అందిస్తున్న యంగ్ రైటర్స్...
Advertisement

తాజా వార్తలు