నాలుగో టెస్టులో ఆధిక్యంలొ భారత్.. సెంచరీ దాహాన్ని తీర్చుకున్న విరాట్ కోహ్లీ..!

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఇండియా- ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న నాలుగు టెస్ లో సెంచరీ తో విరాట్ కోహ్లీ చెలరేగుతున్నాడు.241 బంతుల్లో 100 పరుగులు పూర్తి చేశాడు.విరాట్ కోహ్లీ(Virat Kohli ) 1205 రోజుల తర్వాత సెంచరీ చేశాడు.అంటే చివరిగా 2019 నవంబర్ 2న బంగ్లాదేశ్ పై జరిగిన మ్యాచ్లొ సెంచరీ చేసిన విరాట్ కోహ్లీ తరువాత సెంచరీ సాధించడానికి ఇంత సమయం పట్టింది.

 India In The Lead In The Fourth Test ..virat Kohli Century , Virat Kohli , Cent-TeluguStop.com

దాపుగా 41 ఇన్నింగ్స్ తర్వాత విరాట్ కోహ్లీ సెంచరీ సాధించాడు.విరాట్ కోహ్లీ సెంచరీ చేయడంతో స్టేడియం మొత్తం కోహ్లీ నామస్మరణతో మారు మ్రోగింది.అంతేకాకుండా ఆస్ట్రేలియాపై కోహ్లీ ఓవరాల్ గా 16 సెంచరీలు చేశాడు.మూడో టెస్ట్ లో తడబడిన భారత జట్టు, నాలుగో టెస్ట్ లో ఫీల్డింగ్ లో అట్టర్ ప్లాప్ అయ్యిందంటూ విమర్శలు అందుకుంది.

ఆస్ట్రేలియా నాలుగో టెస్ట్ లో ( Fourth test)480 పరుగుల భారీ స్కోరు చేసింది.అంతకంటే సమర్థవంతంగా భారత జట్టు ఐదు వికెట్ల నష్టానికి ఆస్ట్రేలియా స్కోర్ ను సమం చేసి ముందుకు దూసుకుపోతోంది.

శుబ్ మన్ గిల్(Shubman Gill) అద్భుత ఆటను ప్రదర్శించి 128 పరుగులు చేసి అవుట్ అయ్యాడు.ఇక విరాట్ కోహ్లీ ఎట్టకేలకు సెంచరీ సాధించి దాహాన్ని తీర్చుకున్నాడు. అక్సర్ పటేల్ కూడ ఆఫ్ సెంచరీ తో అదరగొట్టాడు.మొత్తానికి భారత జట్టు పై వస్తున్న విమర్శలకు చెక్ పెడుతూ బ్యాటింగ్ తొ చెలరేగుతు ఆస్ట్రేలియా బౌలర్లకు చెమటలు పట్టిస్తోంది.

ఇక విరాట్ కోహ్లీ 169 పరుగులతో ఫామ్ లో, అక్సర్ పటేల్ 51 పరుగులతో ఫామ్ లో ఉన్నారు.ప్రస్తుతం స్కోరు ఐదు వికెట్ల నష్టానికి 519 పరుగులు చేసి భారత్ 39 పరుగుల లీడ్ లో ఉంది.

మొత్తానికి భారత్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ లో ఫైనల్ కోసం కసిగా పోరాటం చేస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube