గత కొద్దిరోజులుగా ఆస్ట్రేలియాలో ఖలిస్తానీ మద్ధతుదారులు వీరంగం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే.హిందూ దేవాలయాలను టార్గెట్ చేసి వాటిపై ఖలిస్తాన్ అనుకూల నినాదాలు, భారత వ్యతిరేక రాతలను రాస్తున్నారు.
ఇది మరింత తీవ్రస్థాయికి చేరుకుని ఏకంగా తోటి భారతీయులపైనే ఖలిస్తాన్ మద్ధతుదారులు దాడికి పాల్పడ్డారు.భారత జాతీయ పతాకాలను పట్టుకున్న వారిని చితకబాదడంతో పాటు కత్తులతో బెదిరించారు.
మన జెండా కర్రల్ని ధ్వంసం చేశారు.ఈ చర్యలను భారత ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది.
ఆస్ట్రేలియాలోని భారత హైకమీషనర్ మన్‌ప్రీత్ వోహ్రా భారత వ్యతిరేక, ఖలిస్తాన్ అనుకూల దేవాలయాలను సందర్శించారు.అనంతరం విక్టోరియా ప్రీమియర్ డేనియల్ ఆండ్రూస్‌ను కూడా కలిశారు.ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలపై ఆయన డేనియల్‌తో చర్చించారు.ప్రజల మధ్య అసమానతలను సృష్టిస్తున్న ఖలిస్తానీ గ్రూపులను దేశంలోనికి అనుమతించరాదని వోహ్రా ఈ సందర్భంగా అన్నారు.
ఇక ఖలిస్తానీ అనుకూల శక్తులు గతంలో ధ్వంసం చేసిన బీఏపీఎస్ శ్రీ స్వామి నారాయణ్ మందిర్, ఇస్కాన్ కృష్ణ దేవాలయాన్ని కూడా మన్‌ప్రీత్ సందర్శించారు.

ఖలిస్తాన్ అనుకూల శక్తులు ఆస్ట్రేలియాలో తమ కార్యకలాపాలను వేగవంతం చేస్తున్నాయని భారత హైకమీషన్ ఓ ప్రకటనలో తెలిపింది.నిషేధిత ఉగ్రవాద సంస్థలైన సిక్ ఫర్ జస్టిస్ (ఎస్ఎఫ్‌జే) సహా ఇతర వేర్పాటువాద సంస్థలు చురుకుగా పనిచేస్తున్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని హైకమీషన్ పేర్కొంది.భారతదేశ సమగ్రత, భద్రత, జాతి ప్రయోజనాలకు హాని కలిగించే కార్యకలాపాల కోసం ఆస్ట్రేలియన్ భూభాగాన్ని ఉపయోగించడాన్ని అనుమతించకూడదని ఆ దేశ ప్రభుత్వానికి సూచించినట్లు తెలిపింది.

ఈ క్రమంలో మన్‌ప్రీత్ వోహ్రా మీడియాతో మాట్లాడుతూ.ఆస్ట్రేలియాలోని మెజారిటీ సిక్కులు సైతం వేర్పాటువాద ధోరణులకు మద్ధతు ఇవ్వరని అన్నారు.గురుద్వారాలను స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నించే రాడికల్ ఎలిమెంట్స్ వల్ల చాలా మంది తరచుగా బెదిరింపులకు గురువుతున్నారని హైకమీషనర్ అన్నారు.ద్వేషపూరిత భావజాలానికి ఆస్ట్రేలియాలో చోటివ్వరాదని సిక్కులకు ఆయన సూచించారు.







