ఆఫ్ఘనిస్తాన్ మీదుగా ప్రయాణించడానికి నిరాకరిస్తున్న భారత్, ఆసియా ఎయిర్‌లైన్స్..

యూఎస్ ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (FAA) తాలిబాన్ పాలనలో ఉన్న ఆఫ్ఘనిస్తాన్ మీదుగా వాణిజ్య విమానాలు నడపడానికి దాని నిబంధనలను సడలించింది.అయినప్పటికీ, భద్రతాపరమైన ప్రమాదాల కారణంగా ఇండియా, ఆసియాకు చెందిన చాలా విమానయాన సంస్థలు ఇప్పటికీ అలా చేయడానికి వెనుకాడుతున్నాయి.

2021లో తాలిబాన్ ఆఫ్ఘనిస్తాన్‌ను స్వాధీనం చేసుకుంది.అప్పటినుంచి దేశంలో ఎయిర్ ట్రాఫిక్ నియంత్రణ లేదు.

అంటే ఆఫ్ఘనిస్తాన్( Afghanistan ) మీదుగా ఎగురుతున్న విమానాలపై దాడి చేసే లేదా విమానాలను కాల్చివేసే ప్రమాదం ఉంది.

దీనికి తోడు తాలిబన్లు( Taliban ) గతంలో విమానాల రాకపోకలకు అంతరాయం కలిగించిన సంగతి తెలిసిందే.ఉదాహరణకు, 2021లో వారు ఖతార్ ఎయిర్‌వేస్( Qatar Airways ) విమానాన్ని కాబూల్‌లో ల్యాండ్ చేయమని బలవంతం చేసారు, తద్వారా వారు ప్రయాణికులను విమానం నుంచి దింపారు.ఈ ప్రమాదాల కారణంగా, అనేక విమానయాన సంస్థలు ఆఫ్ఘనిస్తాన్ మీదుగా ప్రయాణించడానికి బదులు ఇరాన్, పాకిస్థాన్ చుట్టూ తిరిగి తమ విమానాలను నడుపుతున్నాయి.ఇది విమాన సమయం, ఇంధన ఖర్చులను పెంచుతుంది.32,000 అడుగుల ఎత్తులో లేదా అంతకంటే ఎక్కువ ఎత్తులో విహరించే విమానాలు యాంటీ ఎయిర్‌క్రాఫ్ట్ ఆయుధాల నుంచి తప్పించుకోగలవని FAA చెబుతోంది.పర్వతాల పైనుంచి కాల్చినా ఇంత ఎత్తులో ప్రయాణించే విమానాలకు ఎలాంటి హాని జరగదని వివరించింది.

Advertisement

అయినప్పటికీ, కొన్ని విమానయాన సంస్థలు ఇప్పటికీ ఆఫ్ఘనిస్తాన్ మీదుగా అంత ఎత్తులో ప్రయాణించడానికి సాహసించడం లేదు.

మరోవైపు తాలిబాన్లు ఆఫ్ఘనిస్తాన్ మీదుగా వెళుతున్న పరిమిత విమానాల నుంచి లాభం పొందుతోంది.వారు తమ గగనతలాన్ని దాటే ప్రతి విమానానికి 700 డాలర్ల రుసుము వసూలు చేస్తారు.ఆ లెక్కన వారు చాలానే డబ్బులను సంపాదించారు.

తాలిబాన్లపై విధించిన ఆంక్షల కారణంగా 2021 నుంచి ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ అసోసియేషన్ (IATA) ఈ ఫీజులను చెల్లించలేదు.

వారికి గాజు గ్లాస్ గుర్తు.. కోర్టుకెక్కిన జనసేన 
Advertisement

తాజా వార్తలు