దాదాపు రెండేళ్ల విరామం తర్వాత ఫిబ్రవరి 21 నుంచి అంతర్జాతీయ ప్రయాణీకులను తమ దేశంలోకి అనుమతిస్తామన్న ఆస్ట్రేలియా ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించారు భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్.కొన్ని నెలలుగా ఆస్ట్రేలియాకు తిరిగి వెళ్లేందుకు నిరీక్షిస్తున్న వారికి.
ముఖ్యంగా విద్యార్ధులకు, తాత్కాలిక వీసా హోల్డర్లకు ఈ నిర్ణయం ఉపశమనం కలిగిస్తుందని జైశంకర్ ఆకాంక్షించారు.విదేశాంగ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా ఆస్ట్రేలియా పర్యటనకు వచ్చిన జైశంకర్ .ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రి మారిస్ పేన్‌తో కలిసి శనివారం సంయుక్తంగా మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.ఆస్ట్రేలియా నిర్ణయంపై కొందరు విద్యార్ధి ప్రతినిధులను తాను కలిశానని.
దీనిపై వారు హర్షం వ్యక్తం చేశారని జైశంకర్ తెలిపారు.
కాగా.
ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసిన్ సోమవారం కీలక ప్రకటన చేశారు.ఫిబ్రవరి 21 నుంచి అంతర్జాతీయ ప్రయాణీకులను ఆస్ట్రేలియాలోకి అనుమతిస్తామని ఆయన స్పష్టం చేశారు.
అయితే వారంతా రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకుని వుండాలని మోరిసిన్ అన్నారు.అయితే రాష్ట్రాలు తమ సొంత క్వారంటైన్ నిబంధనలను మాత్రం అమలు చేస్తాయని ఆయన తెలిపారు.
అంతర్జాతీయ టూరిస్టుల ద్వారా తన పర్యాటక రంగాన్ని తిరిగి గాడిలో పెట్టాలని ఆస్ట్రేలియా భావిస్తోంది.కోవిడ్ ఆంక్షలు, వరుస లాక్‌డౌన్‌ల కారణంగా హాస్పిటాలిటీ రంగం తీవ్రంగా దెబ్బతింది.

టూరిజం ఆస్ట్రేలియా గణాంకాల ప్రకారం.అక్కడి పర్యాటక రంగం కోవిడ్‌కు ముందు 84.9 బిలియన్ డాలర్లకు పైగా ఆర్జించింది.కరోనా వెలుగుచూసిన తొలి సంవత్సరంలో టూరిజం సెక్టార్ 41 శాతం మేర ఆదాయాన్ని కోల్పోయింది.
ప్రస్తుతం దేశంలో కోవిడ్ కారణంగా ఆసుపత్రుల్లో చేరేవారి సంఖ్య తగ్గుముఖం పట్టడంతో క్రమంగా ఆంక్షలను సడిలిస్తున్నారు.ఈ నేపథ్యంలోనే అంతర్జాతీయ టూరిస్టులకు ఆస్ట్రేలియా డోర్స్ ఓపెన్ చేసింది.
ఆస్ట్రేలియాలో చదువుకుంటున్న విదేశీ విద్యార్ధుల్లో చైనా తర్వాత స్థానం భారతీయులదే.ఆస్ట్రేలియా డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ గణాంకాల ప్రకారం.గతేడాది 2,500 మంది భారతీయ విద్యార్ధులు అడ్మిషన్లు పొందారు.2019-20 ఆర్ధిక సంవత్సరంలో భారతీయ విద్యార్ధులు ఆస్ట్రేలియా ఆర్దిక వ్యవస్థకు 6.6 ఆస్ట్రేలియా బిలియన్ డాలర్లు అందించారు.







