ఒకప్పుడు దేశ రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషించిన తెలుగు దేశం అదినేత చంద్రబాబు ( Chandrababu Naidu )ఆ తర్వాత జరిగిన అనేక పరిణామాలతో కాలం కలిసి రాక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకే పరిమితమయ్యారు.ఆ తదనంతర పరిస్థితుల్లో తెలంగాణ పోరాటం, రాష్ట్రం ఏర్పడటం వంటి పరిణామాలతో పూర్తిస్థాయి ప్రాంతీయ పార్టీ నేతగా మారిపోయారు .
అయితే ఇప్పుడు కేంద్ర స్థాయిలో ఎన్డీఏ మరియు ఇండియా కూటములు హోరాహోరీగా పోరాడుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో బాబు నిన్న మొన్నటివరకూ ఎన్డీఏ కూటమి వైపు మొగ్గు చూపారు.మరోసారి కేంద్రంలో బజాపా అధికారంలోకి రావడానికి అవకాశం ఉందని, భారీ మెజారిటీ రాకపోయినా కనీస మెజారిటీతో మోడీ ( Narendra Modi )మరోసారి అధికారంలోకి వస్తారని భావిస్తున్న తెలుగుదేశం ఇప్పటివరకు భాజపా తో స్నేహం కోసం అర్రులు సాచింది .అయితే నోటితో నవ్వుతూ నొసటితో వెక్కిరించిన చందంగా తమతో చర్చలు జరుపుతూనే మరోవైపు జగన్తో స్నేహం నడుపుతున్న కేంద్రభాజక వైఖరి తెలుగుదేశం శ్రేణులకు ఇప్పుడు మింగుడు పడటం లేదు.
చంద్రబాబును అరెస్టు చేయడం వరకు జగన్ ప్రభుత్వం తెగించిందంటే దాని వెనక కేంద్రం మద్దతు కచ్చితంగా ఉంటుందని ఇప్పుడు తెలుగుదేశం వ్యూహ కర్తలు అనుమానిస్తున్నారు.ఇలాంటి పరిస్థితుల్లో ఇండియా కూటమి నుంచి చంద్రబాబుకు ఊరట దక్కింది .ఒకవైపు అఖిలేష్ యాదవ్( Akhilesh Yadav ) మరోవైపు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ( Mamata Banerjee ) తో పాటు ఇండియా కూటమి లోని కీలక నేతలు చంద్రబాబుకు మద్దతు ఇస్తూ స్టేట్మెంట్లుఇస్తున్నారు .ప్రతిపక్ష పార్టీ నేతలను అరెస్టు చేయడం ఈరోజు కేంద్రంలో ఒక ట్రెండ్ గా మారిపోయిందని తమ రాజకీయ ప్రయోజనాల కోసం రాజకీయ ప్రత్యర్థులను ఇబ్బందులు పెడుతున్నారు అంటూ ఈ నేతలు చంద్రబాబును ఉద్దేశిస్తూ ప్రకటనలు ఇస్తున్నారు.నిన్న మొన్నటి వరకు భాజపాతోనే కలిసి నడుద్దాం అని భావించిన తెలుగుదేశం అధినేత ఇటీవల జరిగిన పరిణామాలతో మనసు మార్చుకుని ఇండియా కూటమితో కలిసి నడుస్తారా అన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి .
అయితే ఇప్పటికే ఒకసారి ఎన్డీఏ కూటమి లో నుంచి బయటకు వచ్చి చాలా నష్టపోయామన్న భావనలో ఉన్న చంద్రబాబు మరోసారి అంతా ధైర్యం చేస్తారా అంటే అనుమానమే అని చెప్పవచ్చు .దీనిని బట్టి మద్దతు ఇచ్చిన ఇవ్వకపోయినా భాజపాతోనే తన ప్రయాణమని తెలుగుదేశం అధినేత ప్రకటించే అవకాశాలు ఎక్కువ అన్నది విశ్లేషకులు మాట
.