ఆరోగ్యానికి సిరి ఉసిరి.. జలుబు, నోటిపూత తో సహా ఎన్ని సమస్యలకు చెక్ పెడుతుందో తెలుసా?

ఉసిరి( amla ) ఆరోగ్యానికి సిరి అని అంటుంటారు.ఎందుకంటే మన ఆరోగ్యానికి తోడ్పడే ఎన్నో పోషకాలు మరియు ఔషధ గుణాలు ఉసిరిలో నిండి ఉంటాయి.

ఆహారంలో ఉసిరిని భాగం చేసుకోవడం వల్ల అనేక జబ్బులకు దూరంగా ఉండవచ్చు.అలాగే జలుబు, నోటి పూత, మలబద్ధకం ( Colds, mouth sores, constipation )తదితర సమస్యలకు ఉసిరితో సులభంగా చెక్‌ పెట్టవచ్చు.

అందుకు ఉసిరిని ఎలా ఉపయోగించాలి అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.ప్రస్తుత వర్షాకాలంలో అత్యధికంగా వేధించే సమస్యల్లో జలుబు ముందు వరుసలో ఉంటుంది.

పైగా ఇంట్లో ఒకరికి జలుబు చేసిందంటే మిగతా వారికి కూడా వచ్చేస్తుంటుంది.అయితే జలుబు నివారణకు వన్ టేబుల్ స్పూన్ ఉసిరి పొడి తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్లు తేనె కలిపి రోజుకు మూడు పూటలా తీసుకోవాలి.

Advertisement

ఇలా చేయడం వల్ల జలుబు నుంచి చాలా వేగంగా బయట పడతారు.

అలాగే నోటి పూత సమస్యను దూరం చేయడానికి కూడా ఉసిరి సహాయపడుతుంది.రెండు ఉసిరి కాయలను మెత్తగా దంచి రసం తీసుకోవాలి.ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ లో ఉసిరి జ్యూస్ మిక్స్ చేసి మౌత్ వాష్ ( Mouth wash )గా ఉపయోగించాలి.

ఉసిరి రసం కలిపిన వాటర్ తో రోజుకు రెండుసార్లు నోటిని పుక్కిలిస్తే నోటి పూత తగ్గుముఖం పడుతుంది.మలబద్ధకం నివారణకు ఉసిరి న్యాచురల్ మెడిసిన్ లా పనిచేస్తుంది.

రోజుకు ఒక ఉసిరికాయను నేరుగా నమిలి తింటే అందులోని ఫైబర్ కంటెంట్ జీర్ణ వ్యవస్థ పనితీరును చురుగ్గా మారుస్తుంది.మలబద్ధకం సమస్యను తరిమి కొడుతుంది.

మోక్షజ్ఞ మూవీ మొదలుకాకుండానే భారీ టార్గెట్ ఫిక్స్.. ఆ లక్ష్యాన్ని సాధిస్తారా?
ఒకప్పటి పాపులర్ యాంకర్ అనిత చౌదరి భర్త గురించి మీకు తెలియని విషయాలు

వెయిట్ లాస్ అవ్వాలని భావిస్తున్న వారికి కూడా ఉసిరి సహాయపడుతుంది.రోజు ఉదయం ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో మూడు టేబుల్ స్పూన్లు ఫ్రెష్ ఉసిరి జ్యూస్ మరియు చిటికెడు మిరియాల పొడి కలిపి తీసుకోవాలి.ఈ డ్రింక్ మెటబాలిజం రేటును పెంచి బరువు తగ్గే ప్రక్రియను వేగవంతం చేస్తుంది.

Advertisement

అదే సమయంలో శరీరంలో పేరుకుపోయిన కొవ్వును కరిగిస్తుంది.అంతేకాకుండా ఉసిరిని ఆహారంలో భాగం చేసుకుంటే రోగ నిరోధక వ్యవస్థ బలపడుతుంది.

కంటి చూపు రెట్టింపు అవుతుంది.ఉసిరిలో ఉండే విటమిన్ సి మన శరీరంలో ఐరన్ శోషణకు మద్దతు ఇచ్చి రక్తహీనత దరిచేరకుండా సైతం కాపాడుతుంది.

తాజా వార్తలు