పెరిగిన మోదీ ఆస్తులు..

ప్రధాని నరేంద్ర మోదీ ఆస్తులు గత ఏడాది కంటే పెరిగాయి.ప్రస్తుతం ఆయన ఆస్తుల విలువ రూ.3.7 కోట్లకు చేరింది.యోటా ఆస్తులు, అప్పుల వివరాలు వెల్లడిస్తున్న మోదీ ఈ ఏడాది మార్చి 31 నాటికి వివరాలను బహిర్గతం చేశారు.2020లో రూ.2.8 కోట్లు ఉండగా ప్రస్తుతం ఆయన ఆస్తులు రూ.22 లక్షలు పెరిగాయి.ప్రభుత్వం నుంచి పొందే రూ.2 లక్షల జీవితమే ప్రధానికి ముఖ్య ఆదాయ వనరుగా ఉంది.ఆ మొత్తాన్ని ఫిక్స్డ్ డిపాజిట్ల మలో పెట్టడం వాటివల్ల వచ్చే వడ్డీ తిరిగి పెట్టుబడి పెట్టడమే ఆయన ఆదాయంలో వృద్ధి కారణమని తెలుస్తుంది.

 Increased Modi Assets, Modi , Ssets , Ghandi Nagar , New Hose , Incresed , 3.7-TeluguStop.com

గుజరాత్లోని గాంధీ నగర్ ఎస్.బీ.ఐ బ్రాంచ్ లో మోదీ ఫిక్స్డ్ డిపాజిట్లు విలువ గతేడాది రూ‌.1.5 కోట్లు ఉండగా ఈ ఏడాది మార్చి 31 నాటికి రూ.16 కోట్లకు పెరిగింది.మోదీ వద్ద నాలుగు బంగారపు ఉంగరాలు ఉండగా వాటి విలువ రూ.1.48 లక్షలు గా ఉంది.బ్యాంకు బ్యాలెన్స్ రూ.1.5 లక్షలు, నగదు రూపంలో రూ.  36వేలు ఉన్నట్లుగా ఆయన పేర్కొన్నారు.2014లో ప్రధాని అయినప్పటి నుంచి ఇప్పటివరకు మోదీ ఎలాంటి ఆస్తులు కొనుగోలు చేయలేదు.సొంత వాహనం కూడా లేదు.2002లో మోదీ సహా మరో ముగ్గురు వాటాదారులు కొనుగోలు చేసిన నివాస భవనం విలువ రూ.1.10 కోట్లుగా ఉంది.ప్రజాజీవితంలో పారదర్శకతకు 2004లో వాజ్ పేయి ప్రభుత్వం ఆస్తుల వెల్లడి ప్రకృయ ప్రారంభించగా అప్పటినుంచి రాజకీయ నేతలు ఆస్తులు, అప్పులు వివరాలు వెల్లడిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube