ఇక వేగం పెంచండి ! పార్టీ లో పరిణామాల పై జగన్ అలెర్ట్ ?

గత కొద్దరోజులుగా వైసీపీలో చోటు చేసుకుంటున్నా పరిణామాలపై ఆ పార్టీ అధినేత,  ఏపీ సీఎం జగన్ పూర్తిస్థాయిలో దృష్టి సారించారు.తమకు కంచుకోటగా ఉన్న నెల్లూరు జిల్లాలో ముగ్గురు వైసిపి ఎమ్మెల్యేలు ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ,  రెబల్ గా మారడం,  పార్టీ పైన,  ప్రభుత్వం పైన విమర్శలు చేస్తూ టిడిపిలోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తూ ఉండడం,  ఇంకా ఈ బాటలో మరికొంతమంది ఎమ్మెల్యేలు వెళ్లేందుకు సిద్ధమవుతుండడం , తదితర పరిణామాలపై జగన్ సీరియస్ గానే దృష్టి పెట్టారు.

 Increase The Speed Jagan Alert On Developments In The Party ,jagan, Ap Cm Jagan,-TeluguStop.com

ఇప్పటికే వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి,  నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి,  ఇప్పుడు ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి వంటి వారు ప్రభుత్వంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ మీడియా ముందు బహిరంగంగా విమర్శలు చేస్తున్నారు.దీనికి చెక్ పెట్టేందుకు జగన్ సిద్ధమవుతున్నారు.

ఇప్పటికే నెల్లూరు రూరల్,  వెంకటగిరి నియోజకవర్గాలకు పార్టీ తరఫున ఇంచార్జీలను నియమించారు.

Telugu Ap Cm Jagan, Ap, Jagan, Mlakotam, Subbar Reddy, Ysrcp-Politics

అలాగే పార్టీ కీలక నేతలు సజ్జల రామకృష్ణారెడ్డి,  వై వి సుబ్బారెడ్డి, బాలనేని శ్రీనివాస్ రెడ్డి తోపాటు,  26 జిల్లాలకు సంబంధించిన పార్టీ కోఆర్డినేటర్లతో జగన్ సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా పార్టీని బలోపేతం చేసేందుకు, ప్రజల్లో మరింత ఆదరణ పెంచుకునేందుకు ఏం చేయాలనే విషయం పైన జగన్ చర్చించారు.అన్ని కులాల సదస్సులను రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించేందుకు ప్లాన్ చేయాలని జగన్ పార్టీ శ్రేణులకు సూచించారు.

జయహో బీసీ తరహాలో ఎస్సీ,  ఎస్టీ, మైనార్టీ సదస్సులు నిర్వహణ పైన దృష్టి సారించాలని జగన్ ఆదేశించారు.అలాగే పార్టీని సంస్థగతంగా మరింత బలోపేతం చేసేందుకు ఏం చేయాలని విషయం పైన పార్టీ కోఆర్డినేటర్లకు తగిన సూచనలు చేశారు.

అలాగే గృహ సారధులు,  సచివాలయ కన్వీనర్ల నియామకాలను త్వరగా పూర్తిచేయాలని, వెనుకబడిన నియోజకవర్గాలపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని, స్థానిక నాయకులతో సమావేశాలు ఏర్పాటు చేసి త్వరగా ఆ నియామకాలను చేపట్టాలని జగన్ సూచించారు.అలాగే పార్టీలో నెలకొన్న గ్రూపు రాజకీయాలపైన జగన్ దృష్టి సారించారు.

Telugu Ap Cm Jagan, Ap, Jagan, Mlakotam, Subbar Reddy, Ysrcp-Politics

ఈ మేరకు పార్టీ కీలక నాయకులను రంగంలోకి దింపి నియోజకవర్గాల వారీగా గ్రూపు రాజకీయాలకు చెక్ పెట్టే విధంగా  జగన్ ప్లాన్ చేస్తున్నారు.ఇక ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల పైన ఎక్కువగా ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని పార్టీ శ్రేణులకు సూచించారు.నెల్లూరు జిల్లాలోని అసంతృప్త ఎమ్మెల్యేల బాటలో మరికొంతమంది పయనించేందుకు సిద్ధం అవుతూ ఉండడం తో ఎవరెవరు అసంతృప్తితో ఉన్నారనే విషయాన్ని గుర్తించి, వారితో చర్చించి ఎటువంటి సమస్య లేకుండా చేయాలని పార్టీ కీలక నేతలు కొంతమందికి జగన్ బాధ్యతలు అప్పగించారట.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube