ChatGPT యాప్ దూసుకుపోతోంది.ప్రపంచంలోనే అత్యంత వేగంగా ఎదుగుతున్న యాప్‌గా అరుదైన ఫీట్ సాధించింది.
రిలీజైన కొద్ది నెలల్లోనే ChatGPT సాధించిన మైలురాళ్లను ఇపుడు ప్రముఖ యాప్‌లు అని చెప్పుకుంటున్న సో కాల్డ్ యాప్స్ కూడా చేరుకోలేదు అంటే నమ్మశక్యం కాదు.అవును గత ఏడాది నవంబర్‌లో ChatGPT లాంఛ్ అయిన సంగతి అందరికీ తెలిసినదే.
కాగా కేవలం ఇది రిలీజైన 5రోజుల్లోనే 10 లక్షల మంది యాక్టివ్ యూజర్లను సాధించగా, 2 నెలల్లోనే 10 కోట్ల యూజర్లను ఈ యాప్ సాధించింది.
ప్రముఖ యాప్స్ అయినటువంటి ఇన్‌స్టాగ్రాం, స్పాటిఫై, టిక్‌టాక్ వంటి కంపెనీలు రెండేండ్లకు కూడా ఈ ఫీట్ సాధించకపోవడం కొసమెరుపు.ఏ సోషల్ మీడియా, కంటెంట్ సంబంధిత యాప్‌కు సాధ్యం కాని రీతిలో రోజుకు 1.3 కోట్ల యూజర్లను ఆకట్టుకుందని ఓ వెబ్ రిపోర్ట్ తాజాగా వెల్లడించింది.ఓపెన్ఏఐ డెవలప్‌చేసిన ChatGPT అత్యంత వేగంగా ఎదిగిన యాప్ అంటూ కొనియాడుతున్నారు.20 ఏండ్ల ఇంటర్‌నెట్ స్పేస్‌లో ఇంత వేగంగా ఎదిగిన కన్జూమర్ ఇంటర్‌నెట్ యాప్ ఇదేనని UBS రీసెర్చ్ రిపోర్ట్ వెల్లడించింది.
ఇకపోతే ఈ 10 కోట్ల నెలవారీ యూజర్లను చేరుకునేందుకు టిక్‌టాక్ యాప్ కి 9 నెలల పట్టగా, ఇన్‌స్టాగ్రాం యాప్ కి దాదాపు రెండున్నరేండ్లు పట్టింది.మరీ ముఖ్యంగా ChatGPT యువతని, ప్రొఫెషనల్ యూజర్ల దృష్టిని విపరీతంగా ఆకర్షిస్తోంది.ఈమెయిల్స్ రాయడం, అసైన్‌మెంట్స్‌తో పాటు క్లిష్టమైన కోడింగ్ ఇష్యూలను కూడా ChatGPT యాప్ సులభంగా పరిష్కరిస్తోందని సమాచారం.దాంతో ChatGPTకి విశేష ఆదరణ లభిస్తుండటంతో గూగుల్ సొంతంగా తన ఏఐ చాట్‌బాట్ వెర్షన్‌ను లాంఛ్ చేసేందుకు సన్నద్ధమైందని విశ్వసనీయవర్గాల సమాచారం.