తెలంగాణలో గేట్ పరీక్ష సెంటర్లను పెంచుతున్నట్లు కేంద్రం ప్రకటించింది.పరీక్షా కేంద్రాలను పెంచాలని కోరుతూ కేంద్రమంత్రి కిషన్ రెడ్డి రాసిన లేఖకు స్పందించింది.
ఈ మేరకు రాష్ట్రంలో నాలుగు పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయనుంది.దీంతో ఆదిలాబాద్, మెదక్, భద్రాద్రి కొత్తగూడెంతో పాటు నల్గగొండలో కొత్తగా గేట్ పరీక్ష కేంద్రాలు ఏర్పాటు కానున్నాయి.
ఇప్పటికే తెలంగాణలో ఏడు సెంటర్లలో గేట్ ఎగ్జామ్స్ ను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.కొత్తవాటితో కలిపి రాష్ట్రంలో మొత్తం ఎగ్జామ్ సెంటర్ల సంఖ్య పదకొండుకు చేరింది.