అసెంబ్లీ సమీపంలో ని ట్రాఫిక్ పీఎస్ వద్ద సహజ వనరుల దోపీడీ పై నిరసన చేపట్టిన తెదేపా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు.అవినీతిలో ఏ 1 జగన్ రెడ్డి అంటూ నినాదాలు.
లేపాక్షి భూములు జగన్ కుటుంబం కబ్జా చేస్తే, ఖాళీ స్థలాలను వైసిపి ల్యాండ్ మాఫియా కబ్జా చేస్తోందని ఆరోపణ.జగన్ రెడ్డి స్కాం రెడ్డి గా మారి, అవినీతికి బ్రాండ్ అంబాసిడర్ గా నిలిచారని నేతల ధ్వజం.
భూ, ఇసుక, మద్యం, మైన్స్, బియ్యం దోపిడీకి వైకాపా నేతలు పాల్పడుతున్నారంటూ అసెంబ్లీకి కాలినడకన వెళ్లిన నేతలు.
ఇసుకను మింగేస్తున్న వైసీపీ ఇసుకాసురులు అంటూ ప్లకార్డుల ప్రదర్శన.
జే బ్రాండ్స్ తో జగన్ రెడ్డి పేదల రక్తం తాగుతున్నారని నినాదాలు.జగన్ వాకిట్లో గంజాయి చెట్లు, సెంటు భూమి పేరుతో ప్రజాధనం లూటీ అంటూ ప్లకార్డులు చేతపట్టి నినాదాలు.
మైనింగ్ మాఫియా డాన్ గా జగన్ రెడ్డి ఉంటే, వైసీపీ నేతలు రేషన్ బియ్యం కొట్టేస్తున్నారని నేతల మండిపాటు.ఎర్ర చందనాన్ని వైకాపా నేతలు ఏటిఎంగా మార్చుకున్నారని నేతల మండిపాటు.