పెళ్లి మండపంలో ఎద్దు బీభత్సం.. పరుగులు తీసిన జనం

కొన్ని జంతువులను ఒక్కోసారి అదుపు చేయలేం.జనావాసాల్లోకి వచ్చి నానా హంగామా సృష్టిస్తాయి.

 In The Wedding Mandap, The Bull Ran Away , Bride, Groom,bull, Viral Latest, News-TeluguStop.com

ముఖ్యంగా ఎద్దులు వంటి బలమైన జంతువులను అదుపు చేయాలంటే చాలా కష్టం.ఇక వీటిని అదుపు చేసే ఆట జల్లికట్టు అంటే తమిళనాడు వంటి ప్రాంతాల్లో విపరీతమైన క్రేజ్ ఉంటుంది.

వాటి కోసం కోర్టులకైనా వెళ్తారు.భారీ నిరసనలు అయినా చేస్తారు.

ఈ సాంప్రదాయ క్రీడ అంటే అక్కడి ప్రజలకు ఉండే మక్కువ అలాంటిది.అయితే ఎద్దులు నిజంగా ప్రజలు ఉన్న ప్రాంతాల్లోకి వస్తే చాలా ప్రమాదాలు జరుగుతాయి.

ఇలాగే ఓ ఎద్దు పెళ్లి మండపం లోకి పిలవని అతిథిలా వచ్చేసింది.అక్కడ కాసేపు హంగామా సృష్టించింది.

దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.

పెళ్లిళ్లు, ఏదైనా ఫంక్షన్లు జరిగినప్పుడు ఏదైనా అనుకోని గలాటా ఎదురైతే ఆ పెళ్లి ఇంటి వారు చాలా గాబరా పడుతారు.

ఎక్కడ తమ ఫంక్షన్ పాడవుతుందోననే భయం వారిని వెంటాడుతుంది.ముఖ్యంగా ఫంక్షన్లలో చాలా మంది తాగి గొడవలు చేస్తారు.వారిని అదుపు చేయడం చాలా కష్టంగా ఉంటుంది.ఒక్కోసారి పెళ్లిళ్లు చెడిపోతాయి.

అయితే మనుషుల బదులు జంతువులు హంగామా సృష్టిస్తే ఏం చేయాలో ఎవరికీ అర్ధం కాదు.ఇదే తరహాలో ఓ ఎద్దు ఓ పెళ్లి వేదిక వద్దకు చేరుకుంది.

పెళ్లి జరుగుతున్న ఫంక్షన్ హాల్‌లో ప్రవేశించి, చాలా గొడవ సృష్టించింది.బాగా బలంగా, ఎత్తుగా ఉండి, వాడి అయిన కొమ్ములతో భీకరంగా దర్శనం ఇచ్చింది.

దానిని చూడగానే చాలా మంది భయపడ్డారు.ఇక ఆ ఎద్దు తన కొమ్ములను ఊపుతూ అడ్డొచ్చిన వారి పైకి వేగంగా దూసుకెళ్లింది.

దానిని చూసిన వారంతా భయంతో పరుగులు తీశారు.ముఖ్యంగా భోజనం పెట్టే ప్రాంతానికి వెళ్లి అక్కడ కలియ తిరిగింది.

దానిని చూసి కొందరు అదిలించాలని ప్రయత్నించారు.వారి పైకి అది దూసుకెళ్లింది.

ఇంత రభస సృష్టించిన ఆ ఎద్దు చివరికి అక్కడి నుంచి సైలెంట్‌గా వెళ్లిపోయింది.దీంతో పెళ్లిలో ఉన్న వారంతా ఊపిరి పీల్చుకున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube