పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రెజెంట్ క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు చేస్తున్నాడు.ఈ సినిమా ఇప్పటికే 60 శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది.
ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో ఈ సినిమా షూట్ శరవేగంగా జరుగుతుంది.భారీ బడ్జెట్ తో పీరియాడికల్ పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమాను మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై తెరకెక్కుతోంది.
దీంతో పాటు హరీష్ శంకర్ దర్శకత్వంలో భవదీయుడు భగత్ సింగ్ ప్రకటించాడు.కానీ ఈ సినిమాను సెట్స్ మీదకు తీసుకు వెళ్లడంలో విఫలం అయ్యారు.ఇక ఈ సినిమా అలా ఉండగానే మొన్ననే సుజీత్ తో సినిమా చేస్తున్నట్టు అఫిషియల్ గా ప్రకటించారు.ఈ క్రమంలోనే హరీష్ శంకర్ తో సినిమా ఉంటుందా ఉండదా అని వార్తలు వచ్చాయి.
అయితే పవన్ కళ్యాణ్ తో తాను చేయనున్న సినిమాకు సంబంధించి అతి త్వరలోనే ఒక భారీ అప్డేట్ రానుంది రెడీగా ఉండండి అంటూ నిన్న సోషల్ మీడియా వేదికగా హరీష్ పోస్ట్ చేయడంతో ఈ పోస్ట్ వైరల్ అయ్యింది.

మరి ఈ అప్డేట్ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసే ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ తెలుస్తుంది.ఈ సినిమా అప్డేట్ డిసెంబర్ 11న అంటే రేపు రానున్నట్టు చెబుతున్నారు.
ఇది నిజమో కాదో తెలియదు కానీ ఈ వార్త మాత్రం నెట్టింట వైరల్ అవుతుంది.
మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.ఈ సినిమా పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్నట్టు కూడా తెలిపారు.
వీరిద్దరి కలయికలో గబ్బర్ సింగ్ వచ్చి సూపర్ హిట్ అవ్వడంతో ఈ కాంబోలో రాబోతున్న నెక్స్ట్ సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి.








