ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు తెలంగాణ 17 ఎంపీలు ఏపీ 25 లోక్ సభ ఎంపీ లు కలిపి 42 మంది ఎంపీ లు ఉండేవారు.దాంతో కేంద్రం లో అధికారం లోకి రావాలని అనుకునే ప్రతి పార్టీ కి యూపీ తర్వాత కనిపించే అతి పెద్ద రాష్ట్రంగా ఉండేది.
దాంతో అప్పటి ముఖ్యమంత్రులు అంతా ఢిల్లీ లో చక్రం తిప్పారు.టిడిపి అధినేత చంద్రబాబు అయితే ఏకంగా ఎన్డీఏలో జాతీయ స్థాయి హోదాను అనుభవించారు.
అంతేనా అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి.ఇప్పటి ప్రధాని అయినా మోడీని తన ఆఫిస్ చుట్టు తిప్పుకున్నారు.
ఇక వైఎస్ రాజశేఖర్ రెడ్డి అయితే.కాంగ్రెస్ కష్టాల్లో ఉన్నప్పుడు 33 సీట్లు గెలిపించి కేంద్రం లో అధికారం లోకి వచ్చేలా చేశారు.
దాంతో అటు టీడీపీ ఉన్నప్పుడు ఇటు కాంగ్రెస్ ఉన్నప్పుడు.ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రులు చక్రం తిప్పి.
ముక్కు పిండి నిధులు వసూలు చేసే వారు.కేంద్రం కూడా మారు మాట్లాడ కుండా రాష్ట్రంలో నిధులు పోసేది.
దాంతో కొద్దో గొప్పో అభివృద్ధి సాధ్యం అయింది.ఓడలు బళ్ళు, బళ్ళు ఓడలు కావడం అంటే.
ఇదే నేమో.కాలం పదేళ్లు తిరిగే సరికి రాష్ట్రం రెండు ముక్కలు కావడం.
జాతీయ పార్టీల హవా పోయి స్థానిక పార్టీలు అందలం ఎక్కడం తో.తెలుగు రాష్ట్రాల పై కేంద్రం ఫోకస్ తగ్గించింది.దానికి తోడు అసలు నిడులుబివ్వడమే మర్చిపోయింది.ఎదో ఫైనాన్స్ కమిషన్ వల్ల కొన్ని గ్రాంట్లు, నిధులు వస్తున్నా.అవి ఆ ఆర్థిక సంవత్సరానికి చాలడం లేదు.దానికి తోడు.
ఆ నిధుల్లో సగానికి పైగా సంక్షేమ పథకాలకు వచ్చేవే .
కేంద్రం ప్రవేశపెట్టే డబ్బులో దాదాపు 30 శాతం కార్పొరేట్లు కే పోతుందని ఎప్పటి నుంచో ఉన్న విమర్శ.ఇక మిగిలిన డబ్బులో ను అధిక భాగం బీజేపీ పాలిత రాష్ట్రాలకు.అంతులోను యూపీ, బీహార్, గుజరాత్ లకు పోతున్నాయి.
ఏపీ తెలంగాణ లను అసలు కన్నెత్తి అయినా చూడటం లేదు.ఎది విస్తర్లో ఎంగిలి మెతుకులు విదిలించి నట్టు.
ఇస్తున్నారు.అవికూడా చివరాకరు నాటికి అరకొరగానే ఉంటున్నాయి.
ఆ రాష్ట్రాల ముఖ్యమంత్రుల తీరు ను భట్టి వస్తున్నాయి.వీటిని ముందే ఊహించిన సీఎం జగన్ ఢిల్లీ వెళ్లి మరీ.కేంద్రం పెద్దలలో మంతనాలు చేశాడు.కేసిఆర్ కు కేంద్రానికి గ్యాప్ రావడం తో.మంత్రి కెటిఆర్ లేఖాస్త్రం సంధించాడు.మరి ఆ లేఖాస్త్రం గానీ జగన్ మంతనాలు గానీ కేంద్రం పై ఎంతవరకు పని చేశాయి అనేది బడ్జెట్ వస్తె గానీ తెలియదు.