జింబాబ్వే( Zimbabwe ) లోని హరారే వేదికగా జరుగుతున్న వన్డే వరల్డ్ కప్ క్వాలిఫయర్ మ్యాచ్లు ఉత్కంఠ భరితంగా సాగుతున్నాయి.పసికూన జట్ల చేతులలో అగ్రశ్రేణి జట్లు చిత్తుగా ఓటమి బాట పడుతున్నాయి.
తాజాగా స్కాట్లాండ్- జింబాబ్వే మధ్య జరిగిన మ్యాచ్ లో 31 పరుగుల తేడాతో జింబాబ్వే ఓటమిని చవిచూసి వరల్డ్ కప్ రేస్ నుండి వైదొలిగింది.వెస్టిండీస్( West Indies ) జట్టు స్కాట్లాండ్, నెదర్లాండ్ చేతులలో ఓడి వరల్డ్ కప్ రేస్ నుండి వైదొలిగిన సంగతి తెలిసిందే.
తాజాగా జింబాబ్వే కూడా పసికూనల చేతులలో ఓడి వన్డే వరల్డ్ కప్ కు అర్హత సాధించలేకపోయింది.
క్రికెట్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పసికూన జట్లు చెలరేగుతున్నాయి.
మొదట బ్యాటింగ్ చేసిన స్కాట్లాండ్(Scotland )జట్టు 8 వికెట్ల నష్టానికి 234 పరుగులు చేసింది.అయితే స్కాట్లాండ్ బ్యాటర్లైన మెక్ బ్రిడే 28, మాధ్యు క్రాస్ 38, బ్రెండెన్ మెక్ ముల్లెన్ 34, మున్షీ 31, మిచెల్ లీస్క్ 48, వాట్ 21 పరుగులు నమోదు చేశారు.
స్వల్ప లక్ష్య చేదనకూ దిగిన జింబాబ్వే జట్టు 31 పరుగుల తేడాతో ఓటమిని చవిచూసింది.జింబాబ్వే బ్యాటర్లైన సికిందర్ రజా 34, ర్యాన్ బుర్ల 83, వెస్లీ మాదేవేరే 40 పరుగులు చేశారు.
మిగిలిన బ్యాటర్లు రాణించకపోవడంతో 203 పరుగులకు జింబాబ్వే జట్టు ఆల్ అవుట్ అయింది.

స్కాట్లాండ్ బౌలర్లైన క్రిష్ షోలే 3 వికెట్లు, బ్రెండెన్ ముల్లన్ 2 వికెట్లు, మైకేల్ లీక్ 2 వికెట్లు తీసి జింబాబ్వే బ్యాటర్లను కట్టడి చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు.కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్లో జింబాబ్వే ఓడి రేస్ నుండి వైదొలిగింది.

క్వాలిఫయర్ మ్యాచ్లలో శ్రీలంక, జింబాబ్వే, ఐర్లాండ్, వెస్టిండీస్ జట్లలో ఏవైనా రెండు జట్లు వన్డే వరల్డ్ కప్ అర్హత సాధిస్తాయి అని అందరూ భావించారు.కానీ ఐర్లాండ్ జట్టు లీగ్ దశలోనే క్వాలిఫయర్ మ్యాచ్ల నుంచి నిష్క్రమించింది.తరువాత వెస్టిండీస్ జట్టు గ్రూప్ సిక్స్ దశలో నిష్క్రమించింది.
తాజాగా జింబాబ్వే కూడా వన్డే వరల్డ్ కప్ రేస్ నుండి వైదొలిగింది.ఇక శ్రీలంకతో పాటు స్కాట్లాండ్ జట్టు వన్డే వరల్డ్ కప్ కు అర్హత సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి.







