'గాడ్ ఫాదర్' నిశ్శబ్ద విస్ఫోటనం.. ఒక్క మాటలో చెప్పేసిన చిరు!

మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ గా నటించిన సినిమా గాడ్ ఫాదర్.ఈ సినిమా రిలీజ్ కు రెడీ అయ్యింది.

 In The Clouds With God Father Interview,  godfather Movie, Acharya, Megastar Ch-TeluguStop.com

ఆచార్య ప్లాప్ తర్వాత ఈ సినిమాతో మెగాస్టార్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.అందుకే మెగా ఫ్యాన్స్ ఆతృతగా ఎప్పుడు రిలీజ్ అయితే ఎప్పుడు చూద్దామా అని ఎదురు చూస్తున్నారు.

మరొక రెండు వారాల్లో ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 5న రిలీజ్ కానుంది.అయినా కానీ మొన్నటి వరకు ప్రొమోషన్స్ స్టార్ట్ చేయలేదు.

కానీ అనూహ్యంగా చిన్న డైలాగ్ తో మెగాస్టార్ ఈ సినిమాపై భారీగా హైప్ క్రియేట్ చేసారు.ఇక టీమ్ అంతా వరుస ఇంటర్వ్యూలతో, చిట్ చాట్ లతో సిద్ధం అవుతున్నారు.

ఈ క్రమంలోనే తాజాగా మెగాస్టార్ చిరంజీవి కూడా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.ఇది కాస్త వేరైటీ ఇంటర్వ్యూ అనే చెప్పాలి.

ఎందుకంటే ఈ ఇంటర్వ్యూ సాధారణంగా జరగలేదు.మేఘాల మధ్య ఆకాశంలో జరిగింది.

చిరును శ్రీముఖి ఇంటర్వ్యూ చేసిన లేటెస్ట్ ప్రోమో రిలీజ్ చేయగా ఈ ప్రోమో నెట్టింట వైరల్ అయ్యింది.

”ఇన్ ద క్లౌడ్స్ విత్ గాడ్ ఫాదర్” పేరుతో ఈ ఇంటర్వ్యూ ప్రోమో రిలీజ్ చేసి పూర్తి వీడియో 25న రిలీజ్ చేయనున్నట్టు తెలిపారు.ఈ ఇంటర్వ్యూలో పలు అంశాలపై మాట్లాడినట్టు ప్రోమో చూస్తుంటేనే అర్ధం అవుతుంది.గాడ్ ఫాదర్ గురించి ఒక్కమాటలో చెప్పాలంటే నిశ్శబ్ద విస్ఫోటనం అంటూ మెగాస్టార్ చిరంజీవి సింగిల్ లైన్ లో చెప్పడం ఈ ప్రోమోలో చూస్తారు.

మొత్తం వీడియో వస్తే కానీ అసలు చిరు ఏం మాట్లాడారో తెలుస్తుంది.

https://youtu.be/hB-uH188J8w

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube