నారా లోకేశ్ బాబు.టీడీపీ భావి వారసుడు.
చంద్రబాబు తర్వాత అంతటి నేత అయినప్పటికీ రాజకీయాల్లో తనైదైన ముద్ర వేయలేకపోతున్నారు.తండ్రి చాటు బిడ్డగానే ఇంకా మొదలుతున్నారు.
తనదైన స్టైల్ లో రాజకీయం చేయలేకపోతున్నారు.యంగ్ లీడర్ గా జగన్ తో పోటీ పడలేకపోతున్నారు.
అదే తెలంగాణలో సీఎం కేసీఆర్ కొడుకు కేటీఆర్ రాజకీయాల్లో ఆరితేరారు.కనీసం వీళ్లను చూసైనా చినబాబు రాజకీయాలు నేర్చుకోలేకపోతున్నారు.
కానీ తెలుగ తమ్ముళ్లు మాత్రం బాబు అంతటి స్థాయిలో ఎదగాలని కోరుకుంటున్నారు.అయితే గతం కంటే బాగా మెరుగు అని లోకేష్ అనిపించుకున్నా ఇంకా ఆయన పొలిటికల్ గా బాగా రాటుదేలాల్సి ఉంది.
ఇప్పటికే పార్టీ పరంగా అన్ని చక్కబెట్టాల్సిన లోకేశ్ ఇంకా బాబు పైనే ఆధారపడుతున్నాడు.ఇక ఈ రోజుకీ టీడీపీకి ఫేస్ ఫోకస్ అన్నీ చంద్రబాబే.
అలా 2024 ఎన్నికల భారాన్ని మోసేది కూడా చంద్రబాబే.
మండలిలో నంబర్ వన్ సంపపన్నుడు
ఇక మరో వైపు శాసన మండలిలో లోకేష్ యువ నేతగా ఉన్నారు.ఆయన పదవీ కాలం వచ్చే ఏడాది మార్చి దాకా ఉంది.ఆ మధ్యన మూడు రాజధానుల బిల్లుల విషయంలో మండలిలో కాస్తా అలజడి టీడీపీ చేసినపుడు లోకేష్ కొంత వెలుగులోకి వచ్చారు.
అయితే ఆ తర్వాత వరుసగా రాజకీయ మెరుపులు ఏవీ చేయలేకపోయారు.ఇక బయట సభలలో లోకేష్ మాట్లాడుతున్నా పెద్దగా ఇంపాక్ట్ రావడంలేదు.ఇదిలా ఉంటే పెద్దల సభలో లోకేష్ అసలైన పెద్దన్నగా పేరు తెచ్చుకున్నారు.అందిరిలో కెల్లా తానే నంబర్ వన్ అంట ఇప్పుడు.
అదేలా అనుకుంటున్నారా.ఆయన ఏ విషయంలో నంబర్ వన్ గా ఉన్నారు అన్నదాని మీద ఆరా తీస్తే ఏపీ శాసన మండలిలో అందరి కంటే అత్యంత ధనవంతుడు లోకేష్ బాబే అని ఒక నివేదిక తేల్చింది.టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ రూ.369.27 కోట్ల ఆస్తులతో అంధ్రప్రదేశ్ లోనే అత్యధిక ఆస్తులు ఉన్న టాప్ ఎమ్మెల్సీగా నిలిచారని అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్ నివేదిక తెలిపింది.
ఏమిటి లాభం.?
ఇది నిజంగా తమ్ముళ్లు హ్యాపీగా ఫీల్ అవాల్సిన అంశమైతే కాదు.కానీ అదో తృప్తి వారికి.
మండలిలో మొత్తం 58 మంది ఎమ్మెల్సీలు ఉంటే వారిలో లోకేష్ టాప్ ర్యాంక్ ని తీసుకోవడం అంటే రికార్డే కదా.మరి.అలాగేలోకేష్ తో పాటుగా మరో పది మంది దాకా ఎమ్మెల్సీలు ధనవంతులు ఉన్నారట.కానీ వారెవరూ చినబాబు బీట్ చేయలేకపోయారట.అయితే ఈ నంబర్ వన్ పొజిషన్ కంటే పొలిటికల్ గా లోకేష్ బాబు నంబర్ వన్ అవుతే బాగుంటుందన్న తముళ్ల ఆశ తీరేలా లోకేశ్ దూకుడు పెంచుతాడా.ఆ దిశగా అడుగులు వేస్తారా.? చూడాలి మరి.