తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్ చెప్పింది.అక్టోబర్ నెలకు సంబంధించిన రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను విడుదల చేయనున్నట్లు ప్రకటించింది.ఈ టికెట్లను ఈనెల 18వ తేదీ ఉదయం 9 గంటలకు విడుదల చేయనున్నట్లు టీటీడీ తెలిపింది.
వార్షిక బ్రహ్మోత్సవాలు జరిగే రోజులు మిగతా అన్ని రోజులు టికెట్లను విడుదల చేస్తున్నామని వెల్లడించింది.అక్టోబర్ నెలలో శ్రీవారిని దర్శించుకోవాలనే భక్తులు సంబంధిత వెబ్ సైట్ లో టికెట్లు బుక్ చేసుకోవచ్చని సూచించారు.







