పురుగు మందుల ఖర్చు ఆదాచేయడంలో ఈ రైతు ఐడియా బేష్..!

వ్యవసాయంలో చీడపీడల బెడదను అరికట్టితే ఆశించిన స్థాయిలో దిగుబడి పొందవచ్చు.ఒకవేళ వీటిని అరికట్టడంలో విఫలం అయితే తీవ్ర స్థాయిలో నష్టం వాటిల్లుతుంది.

కాబట్టి వ్యవసాయ రైతులు ఎక్కువగా పురుగుమందులను పిచికారి( Spray pesticides ) చేయడంతో భూసారం తగ్గడంతో పాటు పంట విషతుల్యంగా మారుతుంది.ఇక పెట్టుబడి కూడా విపరీతంగా పెరుగుతుంది.

అయితే ఒక రైతు విన్నుతంగా ఆలోచించి చీడపీడలకు అరికట్టే శాశ్వత పరిష్కారం కనుగొన్నాడు.దానికి సంబంధించిన వివరాలు ఏమిటో చూద్దాం.

వరంగల్ జిల్లా గీసుకొండ మండలం ఎలుకుర్తి హవేలీ లో రామకృష్ణారెడ్డి( Ramakrishna Reddy ) అనే రైతు చీడపీడల సమస్యను ఎదుర్కోవడానికి L ఆకారంలో ఉండే ఒక స్టాండ్ తీసుకుని, దాని పై భాగంలో ఒక LED బల్బు ను వెలుతురు అంతా ఒకే చోట కేంద్రీకృతం అయ్యేలాగా అమర్చాడు.కింది భాగంలో ఒక తొట్టి ఏర్పాటు చేసి అందులో సబ్బు నీళ్లు పోశాడు.

Advertisement

తర్వాత సాయంత్రం 6 నుండి రాత్రి 11 గంటల వరకు LED బల్బు ను ఆన్ చేసి ఉంచాడు.రాత్రి సమయంలో లైటింగ్ ఆకర్షణకు గురైన పురుగులు ఆ సబ్బు నీళ్ల తొట్టిలో పడతాయి.

ఆ తర్వాత రోజు మళ్ళీ ఆ తొట్టెను శుభ్రం చేసి మళ్లీ అందులో శుభ్రమైన సబ్బు నీళ్లు ఆ తొట్టిలో పోశాడు.ఇలా పంట పొలంలో అక్కడక్కడ స్టాండ్లను ఏర్పాటు చేసి, పంట పొలాన్ని ఆశించే సన్న దోమలు, రసం పీల్చే పురుగులు పంటను ఆశించకుండా బల్బు వెలుతురు ఆకర్షణకు లోనై సబ్బు నీళ్లలో పడి చనిపోతాయి.

ఇలా చేయడం వల్ల పురుగు మందుల ఖర్చు చాలావరకు ఆదా అవుతుంది.కృష్ణారెడ్డి 2 ఎకరాల పొలంలో 12 స్టాంట్లు ఏర్పాటు చేసుకున్నాడు.వీటి కోసం మొత్తం 15 వేల ఖర్చు అయింది.

ఇందులో ఆటోమేటిక్ సిస్టం సెట్ చేయడం వల్ల సాయంత్రం 6 గంటలకు లైట్లు ఆన్ కావడం.తిరిగి ఉదయం ఆటోమేటిక్గా ఆఫ్ అవుతాయి.

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ భైరవం సినిమాతో సక్సెస్ సాధిస్తాడా..?
ప్రభాస్ ను లైన్ లో పెడుతున్న్న స్టార్ డైరెక్టర్స్...వర్కౌట్ అవుతుందా..?

కృష్ణారెడ్డి ఐడియా ఇతర రైతులకు ఆదర్శంగా నిలిచింది.

Advertisement

తాజా వార్తలు