రెబల్ స్టార్ కృష్ణంరాజు నట వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ప్రభాస్( Prabhas ) ప్రస్తుతం పాన్ ఇండియాలో తన సత్తాను చాటుతున్నాడు.ప్రభాస్ హీరోగా చేసిన సినిమాల్లో వర్షం, డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్, మిర్చి, బాహుబలి, సలార్ లాంటి సినిమాలు సూపర్ డూపర్ సక్సెస్ లను అందుకున్నాయి.
ఇక వీటితోపాటుగా ఆయన చేసిన ప్రతి సినిమా కూడా ప్రేక్షకుడి మన్ననలు పొందుతూ వస్తుంది.ఇక ఇది ఇలా ఉంటే డైరెక్షన్ లో ఆయన చేసిన సాహో సినిమా బాలీవుడ్ లో మంచి విజయాన్ని అందుకుంది.

దాంతో ఈ సినిమా తెలుగు ప్రేక్షకులకి పెద్దగా నచ్చనప్పటికీ హిందీ ప్రేక్షకులను మాత్రం ఈ సినిమా మెస్మరైజ్ చేసిందనే చెప్పాలి.ఇక రీసెంట్ గా ఆయన ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో చేసిన సలార్ సినిమా సూపర్ డూపర్ సక్సెస్ ను అందుకుంది.ఇక దాంతోపాటుగా ప్రస్తుతం సలార్ 2( Salaar 2 ) సినిమా ని కూడా తెరకెక్కించే పనిలో ఉన్నట్టుగా తెలుస్తుంది.ఇక అందులో భాగం గా ఈ సినిమాలో పృథ్వి రాజ్ సుకుమారన్ అండ్ ప్రభాస్ ఇద్దరూ కూడా బద్ధ శత్రువులుగా మారబోతున్నారు అనే విషయం అయితే మనకు చాలా స్పష్టం గా అర్థమవుతుంది.
అందుకోసమే పార్ట్ 2 ని శౌర్యంగ పర్వం అని కూడా ఫిక్స్ చేశారు.ఇక ఇదిలా ఉంటే పార్ట్ 2 లో పృథ్వి రాజ్ సుకుమారన్ ప్రభాస్ ఇద్దరూ కూడా బద్ధ శత్రువులుగా మారి కొట్టుకుంటున్న సమయంలో ప్రభాస్ వాళ్ళ అమ్మ వచ్చి ఇద్దరిని ఆపి సినిమా మొత్తాన్ని టర్న్ చేయబోతున్నట్టుగా తెలుస్తుంది.

ఎందుకంటే చిన్నప్పటి నుంచి పృథ్వి రాజ్ సుకుమారన్( Prithviraj Sukumaran ) కి ప్రభాస్ వాళ్ళ అమ్మంటే చాలా ఇష్టం.అందుకే ఆమె ఏం చెప్పిన వింటాడు.ఇటు ప్రభాస్ ని అటు పృథ్వి రాజ్ సుకుమారన్ ని హ్యాండిల్ చేసే ఒకే ఒక్కరు ఆమె కాబట్టి ఆమె ఈ మొత్తం కథని మార్చబోతున్నట్టుగా తెలుస్తుంది…
.