సినిమా టికెట్ల వ్యవహారం విషయంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..!!

సినిమా టికెట్ల రేట్లు విషయంలో గత కొద్ది నెలల నుండి ఏపీ ప్రభుత్వం వర్సెస్ టాలీవుడ్ ఇండస్ట్రీ అన్న తరహాలో పరిస్థితి ఉందన్న సంగతి తెలిసిందే.

ఆన్ లైన్ బుకింగ్ విధానం తీసుకు రావటం అదేవిధంగా టికెట్ల రేట్లు ధరలు అమాంతం తగ్గించడంతో పాటు బెనిఫిట్ షో లకు అనుమతి ఇవ్వకపోవడంతో ఇండస్ట్రీకి చెందిన చాలా మంది ప్రముఖులు.

ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల అసహనం వ్యక్తం చేస్తూ ఉన్నారు.కొంతమంది హీరోలు మీడియా ముందే ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తప్పుపట్టడం జరిగింది.

పరిస్థితి ఇలా ఉంటే ఉన్న కొద్దీ సమస్య పెరుగుతుండటంతో టికెట్ల ధరల విషయంలో ఏపీ ప్రభుత్వం పునరాలోచించి కమిటీ వేయడం జరిగింది.రాష్ట్రంలో సినిమాలు టికెట్ల వ్యవహారం కొలిక్కి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం సన్నద్ధమైంది.ఇందుకోసం ప్రభుత్వం హోం శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి చైర్మన్ గా పది మంది సభ్యులను కమిటీ గా నియమించడం జరిగింది.

మరో పక్క ఇంటి వైపు మంత్రి పేర్ని నానితో సినీ ప్రతినిధులు సమావేశం కానున్నారు.మరోవైపు రాష్ట్రంలో సినిమా థియేటర్లపై.దాడులు కొనసాగుతున్నాయి.

Advertisement

నిబంధనలు ఉల్లంఘించి రన్ చేస్తున్న థియేటర్లను ప్రభుత్వ అధికారులు సీజ్ చేస్తున్నారు.ఇటువంటి తరుణంలో మంత్రి పేర్ని నాని తో ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు ఈ రోజు భేటీ కావడం సంచలనంగా మారింది.

నేటి ఎన్నికల ప్రచారం : బాబు అక్కడ .. జగన్ ఇక్కడ 
Advertisement

తాజా వార్తలు