కాలేజీల్లో నిర్ణయించిన ఫీజుల కన్నా ఎక్కువ వసూలు చేస్తే జరిమానా తప్పదని తెలంగాణ ఫీజు రెగ్యులేటరీ కమిటీ తెలిపింది.ఏఎఫ్ఆర్సీ నిర్ణయించిన ఫీజు కంటే ఎక్కువ వసూలు చేయరాదంటూ ఆదేశాలు జారీ చేసింది.అదనంగా వసూలు చేస్తే రూ.2 లక్షల వరకు ఫైన్ తప్పదని హెచ్చరించింది.ఎంత మంది దగ్గర అదనంగా ఫీజులు వసూలు చేస్తే అన్ని రెండు లక్షల రూపాయలను కట్టాల్సిందేనని కాలేజీలకు సూచించింది.బీ కేటగిరి అడ్మిషన్ల కోసం పంపిన విద్యార్థుల దరఖాస్తులు కాలేజీలకు అందడం లేదన్న ఫిర్యాదులపై రెగ్యులేటర్ కమిటీ సీరియస్ అయింది.
ఈ నేపథ్యంలో దరఖాస్తులను ఆయా కాలేజీలు మెరిట్ పై పరిగణించకపోతే చర్యలు తప్పవని స్పష్టం చేసింది.







