హథీరాంజీ మఠం మహంతు పై దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు.మహంతు అర్జున్ దాస్ మఠం భూములను అన్యాక్రాంతం చేయడానికి ప్రయత్నించారని అన్నారు, అడ్డుకోవాలని ప్రభుత్వం ప్రయత్నిస్తే కేసులు వేసి అనుకూలంగా తీర్పులు తెచ్చుకున్నారని అన్నారు.
మఠం భూములను కాపడటానికే ధార్మిక పరిషత్ ఉందని మంత్రి తెలిపారు.ధార్మిక పరిషత్ ఆధ్వర్యం లో మఠం భూములను కాపాడుతున్నాం అని అన్నారు.
దేవాలయాల భూములను ఒక్క అంగుళం కూడా అన్యాక్రాంతం కానివ్వం అని చెప్పారు.







