వినాయక చవితి ప్రాముఖ్యత.. ఈ పండుగను చవితి రోజు జరుపుకోవడానికి గల కారణం ఏమిటో తెలుసా?

మన హిందూ క్యాలెండర్ ప్రకారం ఆరవ మాసమైన భాద్రపదమాసం ఎంతో ప్రత్యేకమైనదిగా భావిస్తారు.

ఈ నెలలో ఎన్నో పండుగలు రావటం చేత నెలమొత్తం పండుగ వాతావరణం నెలకొంటుంది.

ముఖ్యంగా భాద్రపద శుక్ల చతుర్దశి రోజు హిందూ మతస్తులు అందరూ పెద్ద ఎత్తున వినాయక చవితి ఉత్సవాలను నిర్వహించుకుంటారు.ఈ విధంగా చతుర్దశి రోజు వినాయకుడి ఉత్సవాలను జరుపుకోవడానికి గల కారణం ఏమిటి.

వినాయక చవితి విశిష్టత ఏమిటి అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.మన హిందూ పురాణాల ప్రకారం స్వర్గలోకంలోని దేవ దేవతలందరూ కలిసి కైలాసానికి చేరుకుని పార్వతీ పరమేశ్వరులకు నమస్కరించి పార్వతీ పరమేశ్వరులను ఈ విధంగా శరణువేడారు.

స్వామి మనం ఏ కార్యం మొదలుపెట్టిన ఆ కార్యానికి ఏ విధమైనటువంటి ఆటంకాలు రాకుండా ఆ కార్యం పూర్తి చేయమని పూజించడం కోసం ఒక దేవుడిని నియమించండి అంటూ పరమేశ్వరుడిని వేడుకున్నారు.ఈ క్రమంలోనే అక్కడే ఉన్నటువంటి పార్వతి తనయులు వినాయకుడు, కార్తికేయుడు ఈ పూజకు మేము అర్హులం అంటూ ఇద్దరు ముందుకు వచ్చారు.

Advertisement
Importance Of Vinayaka Chavithi Reason For Celebrating This Festival, Vinayaka

అయితే ఈ అర్హత పొందడానికి పరమేశ్వరుడు ఒక పరీక్ష పెడతాడు.కార్తికేయుడు, వినాయకుడు ఇద్దరిలో ఎవరైతే ముల్లోకాలను సందర్శించి ముల్లోకాలలో ఉన్న పుణ్యనదులలో స్నాన మాచరించి కైలాసానికి ముందుగా చేరుకుంటారో వారే ఈ పదవికి అర్హులని చెబుతారు.

Importance Of Vinayaka Chavithi Reason For Celebrating This Festival, Vinayaka

ఈ విషయం విన్న వెంటనే కార్తికేయుడు తన వాహనమైన నెమలిని తీసుకుని ముల్లోకాలలో పుణ్యనదులలో సందర్శిస్తాడు.ఈ విషయం విన్న వినాయకుడు పరమేశ్వరుడితో ఈ పోటీ తనకి ఎలా సాధ్యమవుతుందని పరమేశ్వరుడిని ప్రశ్నించడంతో అందుకు నారాయణ మంత్రం జపించమని వినాయకుడికి హితోపదేశం చేస్తాడు.ఒక్కసారి నారాయణ మంత్రం జపించడం వల్ల ముల్లోకాలను సందర్శించిన పుణ్యఫలం దక్కుతుందని చెప్పడంతో వినాయకుడు అక్కడే ఉన్నటువంటి తల్లిదండ్రుల చుట్టూ మూడు ప్రదక్షిణలు చేస్తూ నారాయణ మంత్రాన్ని జపిస్తారు.

Importance Of Vinayaka Chavithi Reason For Celebrating This Festival, Vinayaka

ఇక ముల్లోకాలలో ఏ నది వద్దకు వెళ్ళిన తన కంటే ముందుగా వినాయకుడు అక్కడికి వచ్చినట్లు కార్తికేయునికి కనిపించడంతో ఎంతో ఆశ్చర్యపోతాడు.అలా ముల్లోకాలను సందర్శించి కైలాసానికి చేరుకున్న కార్తికేయునికి తనకంటే ముందుగా కైలాసంలో వినాయకుడు ఉండటం చూసి ఆశ్చర్యపోతారు.ఈ క్రమంలోనే వినాయకుడు శక్తిని గుర్తించని కార్తికేయుడు తన తండ్రి వద్దకు వెళ్లి తన అహంకారానికి చింతించిస్తూ ఆ పదవిని వినాయకుడికి ఇవ్వమని చెబుతాడు.

ఈ విధంగా వినాయకుడు విఘ్నాలను తొలగించే విగ్నేశ్వరుడిగా భాద్రపద శుక్ల చతుర్దశి రోజు పూజలు అందుకోవడం వల్ల అప్పటి నుంచి భక్తులు పెద్ద ఎత్తున వినాయక చవితి ఉత్సవాలను నిర్వహిస్తున్నారు.ఈ క్రమంలోనే వినాయక చవితి రోజు స్వామివారికి ఎంతో ఇష్టమైన పిండిపదార్థాలను నైవేద్యం సమర్పించి భక్తిశ్రద్ధలతో పూజిస్తున్నారు.

దర్శకుడిని ఓ రేంజిలో ఉతికారేసిన చంద్రమోహన్.. అసలు విషయం తెలిసి అవాక్కయ్యాడు..
Advertisement

తాజా వార్తలు