సరికొత్త ఆప్షన్ తో ఐఫోన్ 13 ...!

యాపిల్ కంపెనీ ఇప్పుడు ఒక వినూత్న ఆలోచనతో, సరికొత్త ఫీచర్లతో ఒక కొత్త మొబైల్ ఫోన్ ను త్వరలో మన ముందుకు తీసుకుని రానుంది.ఈ నెల చివరిలో మార్కెట్‌ లోకి ఐఫోన్‌ 13ని విడుదల చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది.

 Apple Iphone Is Now Available With New Emergency Sms Option, New Features, Iphon-TeluguStop.com

ఈ ఫోన్ లో ఆపద సమయంలో ఆదుకునే క్రమంలో ఒక ఎమర్జెన్సీ ఎస్సెమ్మెస్‌ అప్షన్ ను ఇందులో తీసుకురానున్నారు.ఒక్కోసారి మనం మారుమూల ప్రాంతాలకి గాని, అడవులకు, సముద్ర ప్రయాణాలకి వెళ్లినప్పుడు మన ఫోన్ సిగ్నల్ లేక సరిగా పని చేయదు.

అలాంటి సందర్భాల్లో ఏమి చేయాలో తెలియని అయోమయ స్థితిలో ఇతరులతో కమ్యూనికేట్‌ అయ్యేందుకు ఈ ఫీచర్‌ ను ప్రవేశ పెట్టారు.ఆ సమయంలో ఈ ఎమర్జెన్సీ మెసేజ్ ఉపయోగపడుతుందని బ్లూమ్‌బర్గ్‌ టెక్‌ నిపుణుడు మార్క్‌ గుర్‌మన్‌ తెలిపారు.

అయితే ప్రస్తుతం కొన్ని ఫోన్లలో మాత్రమే ఈ అత్యవసర మేసేజ్‌లు చేసే వీలున్నా కానీ అవన్నీ సరైన ఫలితాన్ని ఇవ్వడం లేదు.కానీ యాపిల్‌ అందించే ఎమర్జెన్సీ ఫీచర్‌ ఆపద సమయంలో ఆదుకుంటుందని తెలిపారు.

మెసేజ్ పంపిన వెంటనే రిసీవ్‌ చేసుకున్న వారు త్వరగా మరింత స్పందించే అవకాశం ఉంటుందని ఆయన తెలిపారు.ఎర్త్‌ ఆర్బిన్‌, లియో (LEO) ఆధారంగా ఈ ఎమర్జెన్సీ మెస్సేజ్‌ పని చేస్తుందని చెబుతున్నారు.

అయితే ఐఫోన్‌ 13 లియో టెక్నాలజీ ఆధారంగా పనిచేస్తుంది కానీ దీనికి అవసరమైన హార్డ్‌వేర్‌ ఇంకా అందుబాటులోకి రాలేదు.

Telugu Apple Iphone, Emergency Sms, Iphone, Latest, Ups-Latest News - Telugu

అందుకే ఈ లియో టెక్నాలజీని అందుబాటులోకి తెచ్చేందుకు సమయం పడుతుందట.కానీ యాపిల్‌ కంపనీ మాత్రం సొంతంగా లియో టెక్నాలజీని సొంతంగా తయారు చేయాలనీ భావించింది.అందుకే వేరే సంస్థలకు చెందిన శాటిలైట్‌ లను వాడుకోవడానికి బదులుగా ఆపిల్ కంపనీనే స్వయాగం తయారు చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు టెక్‌ నిపుణులు అంటున్నారు.

అందుకే ఆపిల్ సంస్థ స్వంతగా లియో ఆపరేషన్స్‌ చేసే అవకాశం ఉందని అంటున్నారు.రానున్న రోజుల్లో ఈ ఎమర్జెన్సీ మెసేజ్ చాలా ఉపయోగకరంగా ఉంటుందని అందరు భావిస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube