రాజకీయంగా ఇప్పుడు ఇప్పుడే జనసేన మైలేజ్ సాధిస్తుంది.ఏపీలో ప్రధాన ప్రతిపక్షం తామే అనే స్థాయిలో రాజకీయ పోరాటాలు చేస్తూ, జగన్ ప్రభుత్వానికి ముచ్చెమటలు పట్టిస్తోంది.
రోడ్ల సమస్యలతో పాటు, వివిధ అంశాలపై జనసేన స్పందిస్తున్న తీరు ఆ పార్టీకి ఎక్కడలేని మైలేజ్ తీసుకురావడంతో పాటు, రాజకీయంగా జనసేన కు ప్రజల్లో మంచి ఆదరాభిమానాలు పెరిగేలా చేస్తున్నాయి.ప్రస్తుతం జనసేన ను ప్రజల్లోకి మరింత స్పీడ్ గా తీసుకువెళ్లాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ డిసైడ్ అయ్యారు .క్షేత్ర స్థాయిలో స్వయంగా తానే పోరాటం చేసేందుకు సిద్ధమవుతున్నారు.ఈ క్రమంలోనే పొత్తుల విషయంలోనూ క్లారిటీ తో ఉండాలని పవన్ డిసైడ్ అయ్యారు.
ముఖ్యంగా బీజేపీ విషయంలో పవన్ స్పష్టమైన వైఖరితో ఉండాలని, ఆ పార్టీ తమతో పొత్తు పెట్టుకున్నా, ఏ విషయంలోనూ తమతో కలిసి రావడం లేదని , మొదటి నుంచి ఆగ్రహం గానే ఉన్నారు.బీజేపీతో కలిసి ముందుకు వెళ్ళినా ఇబ్బందులు ఎదుర్కోవాలనే ఉద్దేశంలో ఉన్నారు.
అందుకే ఆ పార్టీతో తెగ తెంపులు చేసుకునేందుకు పవన్ సిద్ధమయ్యారు.త్వరలోనే ఈ విషయాన్ని బహిరంగంగా ప్రకటించేందుకు పవన్ ప్రయత్నాలు చేస్తున్నారు.
అంతకంటే ముందుగా జనసేన ను ఏపీలో మరింత బలోపేతం చేయాలని, క్షేత్ర స్థాయిలో వివిధ కమిటీలను నియమించి , జనసేన కార్యకర్తల్లో కొత్త ఉత్సాహం కలిగించాలని పవన్ అభిప్రాయపడుతున్నారు.ముఖ్యంగా తమకు ఏపీలో ఏ ఏ నియోజకవర్గంలో గెలుపు అవకాశాలు ఉంటాయనే విషయంపై ఆయన రకరకాల మార్గాల ద్వారా సర్వే చేస్తున్నారు.

ఆ సర్వే రిజల్ట్ ఆధారంగా ఆయా నియోజకవర్గాల్లో ఇప్పటి నుంచే కార్యక్రమాలు మొదలు పెట్టాలని నిర్ణయించుకున్నారు.దాదాపు 50 స్థానాలు వరకు తమకు గట్టి పట్టు ఉందనే విషయాన్ని పవన్ గుర్తించారు.ఆయా నియోజకవర్గాల్లో ఇప్పుడే అభ్యర్థులను ఎంపిక చేసి , వారిని క్షేత్రస్థాయిలో పనిచేసే విధంగా యాక్టివ్ చేయాలని చూస్తున్నారు దీని ద్వారా గెలుపు అవకాశాలు తమ పార్టీ కి ఎక్కువ ఉంటాయనేది పవన్ అభిప్రాయంగా కనిపిస్తోంది.