ఓసీఐ కార్డుదారులకు శుభవార్త .. భారతీయ విమానాశ్రయాల్లో అందుబాటులోకి కొత్త ఫెసిలిటీ

ఓవర్సీస్ సిటిజన్‌షిప్ ఆఫ్ ఇండియా (ఓసీఐ)( Overseas Citizenship of India ) కార్డుదారులకు భారత ప్రభుత్వం శుభవార్త చెప్పింది.

ముందుగా వెరిఫై చేయబడిన భారతీయ పౌరులు, ఓసీఐ కార్డులను కలిగి ఉన్న భారత సంతతికి చెందిన వ్యక్తుల కోసం విమానాశ్రయాలలో ఇమ్మిగ్రేషన్ ప్రక్రియను వేగంగా ట్రాక్ చేసే సదుపాయాన్ని భారత ప్రభుత్వం శనివారం లాంఛనంగా ప్రారంభించింది.

ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ‘‘ ఫాస్ట్ ట్రాక్ ఇమ్మిగ్రేషన్ ట్రస్టెట్ ట్రావెలర్ ప్రోగ్రామ్ (ఎఫ్‌టీఐ- టీటీపీ) ’’ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా( Amit Shah ) ప్రారంభించారు.

ఈ సౌకర్యం ప్రయాణీకులందరికీ ఉచితంగా అందుబాటులో ఉంటుందని ఆయన తెలిపారు.అంతర్జాతీయ ప్రయాణీకుల కోసం వేగవంతమైన, సున్నితమైన , సురక్షితమైన ఇమ్మిగ్రేషన్ క్లియరెన్స్ కోసం ఈ కార్యక్రమం రూపొందించినట్లు ఆయన తెలిపారు.ఢిల్లీ( Delhi )తో పాటు ముంబై, చెన్నై, కోల్‌కతా, బెంగళూరు, హైదరాబాద్, కొచ్చి , అహ్మదాబాద్‌లలో తొలుత ప్రారంభిస్తున్నామని.

ఆపై దేశంలోని మరో 21 విమానాశ్రయాలకు విస్తరిస్తామని అమిత్ షా వెల్లడించారు.

Advertisement

అర్హులైన వ్యక్తులు ఈ సదుపాయాన్ని పొందేందుకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవాలి.రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తు ఫామ్‌లో పేర్కొన్న విధంగా వారి బయోమెట్రిక్‌( Biometric )లను (వేలిముద్ర, ఫేస్ ) ఇతర అవసరమైన సమాచారాన్ని సమర్పించాల్సి ఉంటుందని అధికారులు వివరించారు.రెండో దశలో ఈ కార్యక్రమం విదేశీ ప్రయాణీకులకు కూడా వర్తింపజేస్తామని తెలిపారు.

ధృవీకరణ తర్వాత ఈ-గేట్‌లు, ఆటోమెటెడ్ బోర్డర్ గేట్ల ద్వారా ఇమ్మిగ్రేషన్ క్లియరెన్స్ ప్రక్రియలో మానవ జోక్యాన్ని తగ్గించేలా విశ్వసనీయ ప్రయాణీకుల వైట్‌లిస్ట్ రూపొందించబడుతుంది.పాస్‌పోర్ట్ చెల్లుబాటయ్యే వరకు లేదా ఐదేళ్ల పాటు ఈ రిజిస్ట్రేషన్ ఉంటుంది.

అమెరికా సహకారంతో ఈ సదుపాయం ఏర్పాటు చేశారు.ఈ కాన్సెప్ట్‌ను 2013లో అప్పటి యూపీఏ ప్రభుత్వం తొలిసారిగా ప్రతిపాదించింది.

జీఎంఆర్ గ్రూప్ యాజమాన్యంలోని ఢిల్లీ విమానాశ్రయం, ఈ ఫాస్ట్ ట్రాక్ ఇమ్మిగ్రేషన్‌ను సులభతరం చేయడానికి టెర్మినల్ 3లో ఎనిమిది ఎలక్ట్రానిక్ గేట్‌లతో అమర్చినట్లు తెలిపింది.డిమాండ్‌ను బట్టి కౌంటర్ల సంఖ్యను పెంచుతామని వెల్లడించింది.

కెనడా : నయాగరా జలపాతంలో దూకి భారతీయ విద్యార్ధి ఆత్మహత్య
Advertisement

తాజా వార్తలు