రంగారెడ్డి జిల్లా శంషాబాద్ ఎయిర్ పోర్టులో అక్రమ బంగారం పట్టుబడింది.విమానాశ్రయంలో తనిఖీలు నిర్వహించిన కస్టమ్స్ అధికారులు గోల్డ్ ను అక్రమంగా తరలిస్తున్నట్లు గుర్తించారు.
ఈ మేరకు దుబాయ్ నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడి వద్ద 583.11 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.పట్టుబడిన బంగారం విలువ సుమారు రూ.33.57 లక్షలు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.బంగారాన్ని సీజ్ చేసిన అనంతరం నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.







