లొల్లి పెడుతున్న ఇల్లీ పాప.. అందుకేనట!

అందాల భామ ఇలియానా కెరీర్ ప్రస్తుతం ఫేడవుట్‌ అయ్యే దిశగా వెళుతోంది.దేవదాస్ చిత్రంతో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన ఈ గోవా బ్యూటీ, తక్కువ టైమ్‌లోనే స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది.

 Ileana Bollywood Career To Fade Out-TeluguStop.com

అటుపై బాలీవుడ్‌లో కూడా అమ్మడు తన అదృష్టాన్ని పరీక్షించుకుంది.అయితే అమ్మడికి బాలీవుడ్‌లో నిరాశే మిగిలింది.

పెద్దగా గుర్తింపు లేనీ సినిమాలు రావడంతో ఇల్లీ పాపకు అక్కడ కూడా పెద్దగా ఒరిగిందేమీ లేదు.ఇక తన బాయ్‌ఫ్రెండ్‌తో చట్టాపట్టాలేసుకుని తిరిగి చివరకు బ్రేకప్ చెప్పేయడంతో ఇలియానా చాలా మనస్థాపానికి గురైంది.

ఆ బాధ నుండి బయటపడేందుకు అమ్మడు మళ్లీ సినిమాల వైపు అడుగులేస్తుంది.కాగా బాలీవుడ్‌లో గతేడాది కేవలం పాగల్‌పంతి సినిమాలో మాత్రమే ఇల్లీ బేబి నటించింది.ఈ ఏడాదిలో కూడా ఒక్క ఆఫర్ మాత్రమే ఆమెకు వస్తున్నట్లు, ఆ తరువాత ఎలాంటి సినిమాలు లేవని తెలుస్తోంది.అటు టాలీవుడ్‌లోనూ పెద్దగా ఆఫర్లు లేని ఈ హీరోయిన్ బాలీవుడ్‌ కెరీర్ ప్రస్తుతానికి ముగింపు దశకు చేరిందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

మరి ఇలియానాకు తెలుగులోనైనా ఆఫర్లు వస్తాయో లేవో అని ఆమె ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు.అయితే అమ్మడు సోషల్ మీడియాలో మాత్రం తన అందాల ఆరబోతతో అభిమానులను అలరిస్తూనే ఉంది.

ఓడలు బండ్లు కావడం అంటే ఇదేనేమో అంటున్నారు సినీ క్రిటిక్స్.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube