మాస్ రాజా రవితేజ నటించిన తాజా చిత్రం ‘డిస్కో రాజా’ ఇటీవల రిలీజ్ అయ్యి మిక్సిడ్ టాక్‌ను సొంతం చేసుకుంది.ఈ సినిమాకు ముందు వరుస ఫెయిల్యూర్స్‌తో సమతమైన రవితేజ, ఔట్ ఆఫ్ ది బాక్స్ డైరెక్టర్ విఐ ఆనంద్ దర్శకత్వంలో సినిమా చేసి ఎలాగైనా హిట్ అందుకోవాలని చూశాడు.
ఇక ఈ సినిమాపై భారీ నమ్మకం పెట్టుకున్న రవితేజకు ఈసారి కూడా నిరాశే ఎదురైంది.
రిలీజ్ రోజునే పెద్దగా ప్రభావం చూపని డిస్కో రాజా, వీకెండ్ ముగిసే సరికి పెద్దగా కలెక్షన్లు రాబట్టలేకపోయింది.
ఇక వీక్ డేస్‌లో ఈ సినిమాను చూసే నాథుడే లేడు.మొదటి వారం పూర్తయ్యే లోగా ఈ సినిమా డిజాస్టర్‌వైపు అడుగులు వేస్తోంది.కాగా సంక్రాంతికి రిలీజ్ అయిన పెద్ద సినిమాలు ఇంకా సందడి చేస్తుండటంతో డిస్కో రాజాను చూసే వారు లేకుండా పోయారు.
మొత్తానికి ఓ సైన్స్ ఫిక్షన్ సినిమాతో వచ్చి ప్రేక్షకులను అలరిద్దామనుకున్న రవితేజకు ఈ సారి కూడా నిరాశే మిగిలింది.
ఇక ఇప్పుడు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో క్రాక్ అనే సినిమాలో నటిస్తున్న మాస్ రాజా, ఆ సినిమాను పూర్తి కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిస్తున్నాడు.మరి క్రాక్ సినిమాతోనైనా మాస్ రాజా హిట్ అందుకుంటాడేమో చూడాలి.







