నన్ను చూడాలనిపిస్తే వీడియో కాల్ చేయి... నటికి సలహా ఇచ్చిన శేఖర్ మాస్టర్?

If You Want To See Me, Make A Video Call... Sekhar Master Who Advised The Actress ,BB Jodi , Sada ,Shekhar Master ,Bigg Boss ,Mehboob , Sri Satya , BB Jodi Finale

బుల్లితెరపై ఎన్నో కార్యక్రమాలు ప్రసారమౌతూ పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేస్తూ ఉంటాయి ఇలా బుల్లితెర ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్నటువంటి వాటిలో స్టార్ మాలో ప్రసారమవుతున్న బిబి జోడీ(BB Jodi) ఒకటి బిగ్ బాస్(Bigg Boss) కంటెస్టెంట్లతో నిర్వహిస్తున్నటువంటి ఈ డాన్స్ కార్యక్రమం ప్రతి శని ఆదివారం ప్రసారం అవుతు పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేస్తుంది.అయితే చివరికి ఈ కార్యక్రమం ఫినాలేకి చేరుకోవడంతో ఈ కార్యక్రమంలో ఎవరు విన్నర్ గా నిలబడతారనే విషయంపై ఆత్రుత నెలకొంది.

 If You Want To See Me, Make A Video Call... Sekhar Master Who Advised The Actres-TeluguStop.com

ఇక ఈ కార్యక్రమం గ్రాండ్ ఫినాలే ఈనెల 25, 26న జరగబోతోంది.

ఈ క్రమంలోని గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు.ఈ ప్రోమోలో భాగంగా ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా శేఖర్ మాస్టర్(Shekhar Master) హాజరయ్యారు.ఇలా శేఖర్ మాస్టర్ ఈ కార్యక్రమంలో పాల్గొనడంతో ఒక్కసారిగా స్టేజ్ మొత్తం దద్దరిల్లిపోయింది.

ఈయన వచ్చి రావడంతోనే ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్ చేశారు.ఇక చాలా కాలం తర్వాత శేఖర్ మాస్టర్, హీరోయిన్ సదాను వేదికపై చూడటంతో అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేశారు.

ఇక వీరిద్దరూ గతంలో ఢీడాన్స్ షోలో పలు సీజన్లకు జడ్జ్ లుగా వ్యవహరించిన విషయం మనకు తెలిసిందే.

ఇక ఈ కార్యక్రమంలో భాగంగా మెహబూబ్ శ్రీ సత్య చేసిన పర్ఫామెన్స్ చూసిన అనంతరం సదా మాట్లాడుతూ ఇకపై నీ సిక్స్ ప్యాక్ చూడటం మిస్ అవుతాము మెహబూబ్ అంటూ సదా(Sada) బాధపడ్డారు.సదా ఇలా మాట్లాడటంతో వెంటనే రియాక్ట్ అయినటువంటి శేఖర్ మాస్టర్ బాధపడటం ఎందుకు నీకు చూడాలనిపించినప్పుడల్లా వీడియో కాల్ చేసి మెహబూబ్ ను చూడండి అంటూ సెటైర్ వేశారు.ఇలా శేఖర్ మాస్టర్ హీరోయిన్ సదాకు సలహా ఇవ్వడంతో సదా ఒక్కసారిగా సిగ్గుపడుతూ మొహం చాటేసింది.

ప్రస్తుతం ఇందుకు సంబంధించినటువంటి ఈ ప్రోమో వైరల్ గా మారింది.

If You Want To See Me, Make A Video Call Sekhar Master Who Advised The Actress ,BB Jodi , Sada ,Shekhar Master ,Bigg Boss ,Mehboob , Sri Satya , BB Jodi Finale - Telugu Bb Jodi, Bb Jodi Finale, Bigg Boss, Mehboob, Sada, Shekhar Master, Sri Satya #TeluguStopVideo #Shorts

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube