జనసేన పార్టీతో బీజేపీ కలిసి ఉన్నా లేనట్లేనని ఏపీ బీజేపీ ప్రధాన కార్యదర్శి పీవీఎన్ మాధవ్ అన్నారు.ఎమ్మెల్సీ ఎన్నికల్లో గతంలో కన్నా బీజేపీకి ఓట్లు పెరిగాయని తెలిపారు.
ఎమ్మెల్సీ ఎన్నికలలో మద్ధతు ఇవ్వాలని పవన్ కల్యాణ్ ను కోరినా ఆయన స్పందించలేదని మాధవ్ పేర్కొన్నారు.ఈ నేపథ్యంలోనే జనసేన -బీజేపీ కలిసి లేవనే భావన ఉందని తెలిపారు.
క్షేత్రస్థాయిలో కలిసి పనిచేయాలనే కోరుతున్నామని మాధవ్ వెల్లడించారు.అదే విధంగా వైసీపీతో బీజేపీ దోస్తి కడుతుందన్న ప్రచారం అవాస్తవమని స్పష్టం చేశారు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీకి బీజేపీ మద్ధతు అని అసత్య ప్రచారం చేశారని వెల్లడించారు.ఈ క్రమంలో సోషల్ మీడియాలో జరిగిన ప్రచారాన్ని జనసేన ఖండించలేదని మండిపడ్డారు.
దీనిపై ఏ నిర్ణయం తీసుకున్నా జాతీయ నాయకత్వమే తీసుకుంటుందని పేర్కొన్నారు.బీజేపీ ప్రజాపోరులో జనసేన కలిసి రావాలన్న ఆయన జనసేన ఏమైనా కార్యక్రమాలు నిర్వహిస్తే తాము వెళ్తామని స్పష్టం చేశారు.







