ఇంట్లోనే ఫేషియల్ గ్లోను పొందాలనుకుంటే ఈ రెమెడీని ప్రయత్నించండి..!

తమ ముఖ చర్మం అందంగా, కాంతివంతంగా మెరిసిపోవాలని చాలా మంది నెలకు కనీసం ఒకటి రెండు సార్లు బ్యూటీ పార్లర్(Beauty parlor) కు వెళ్లి ఫేషియల్స్ (facial)చేయించుకుంటూ ఉంటారు.

కానీ కెమికల్ ప్రొడక్ట్స్ తో ఇలా తరచూ ఫేషియల్స్ చేయించుకోవడం వల్ల చర్మ ఆరోగ్యం పాడవుతుంది.

అందుకే సహజ పద్ధతిలో ఫేషియల్ గ్లోను పొందేందుకు ప్ర‌య‌త్నించాలి.అందుకు ఇప్పుడు చెప్పబోయే హోమ్ రెమెడీ చాలా బాగా సహాయపడుతుంది.

ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో రెండు బీట్ రూట్ (Beetroot)స్లైసెస్, నాలుగు క్యారెట్(Carrot ) స్లైసెస్ మరియు కొద్దిగా వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.ఇలా గ్రైండ్ చేసుకున్న బీట్ రూట్, క్యారెట్ మిశ్రమంలో వన్ టేబుల్ స్పూన్ ముల్తానీ మట్టి(Multani mitti), రెండు టేబుల్ స్పూన్లు పచ్చి పాలు(Milk) వేసుకుని అన్నీ కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి.

ఇలా తయారు చేసుకున్న‌ మిశ్రమాన్ని ముఖానికి మెడకు అప్లై చేసుకుని 20 నిమిషాల పాటు ఆరపెట్టుకోవాలి.ఆపై చర్మాన్ని సున్నితంగా స్క్రబ్బింగ్ చేసుకుంటూ వాటర్ తో శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.

Advertisement
If You Want To Get A Facial Glow At Home, Try This Remedy! Home Remedy, Facial G

ఫైనల్ గా మంచి మాయిశ్చరైజర్ ను చర్మానికి అప్లై చేసుకోవాలి.

If You Want To Get A Facial Glow At Home, Try This Remedy Home Remedy, Facial G

వారానికి రెండు సార్లు ఈ సింపుల్ హోమ్ రెమెడీని కనుక పాటించారంటే మస్తు లాభాలు మీ సొంతం అవుతాయి.ముఖ్యంగా ఈ రెమెడీ చర్మానికి కొత్త మెరుపు ను జోడిస్తుంది.ముఖాన్ని అందంగా కాంతివంతంగా మారుస్తుంది.

అలాగే ఈ రెమెడీ స్కిన్ కలర్ ను ఇంప్రూవ్ చేస్తుంది.డార్క్ స్పాట్స్ ను తొలగిస్తుంది.

చర్మం పై పేరుకుపోయిన మృత కణాలతో పాటు బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ ను కూడా రిమూవ్ చేస్తుంది కాబట్టి ఇంట్లోనే ఫేషియల్ గ్లోను పొందాలి అనుకుంటే కచ్చితంగా ఇప్పుడు చెప్పుకున్న హోమ్ రెమెడీని ప్రయత్నించండి.మంచి రిజల్ట్ మీ సొంతం అవుతుంది.

సందీప్ రెడ్డి వంగ అల్లు అర్జున్ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అవ్వడానికి కారణం ఇదేనా..?
Advertisement

తాజా వార్తలు