ఉసిరి కాయలు(amla) ఆరోగ్య పరంగా ఎంత మేలు చేస్తాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.భారతీయ ఆయుర్వేదంలో ఎంతో ప్రాముఖ్యత కలిగిన ఔషధంగా ఉసిరి పరిగణించబడుతుంది.
అయితే చాలా మంది చేసే పొరపాటు ఏంటంటే.ఉసిరి గింజలను పారేయడం.
ఉసిరి గింజలు(amla seeds) ఎందుకు పనికిరావని భావిస్తుంటారు.కానీ ఉసిరి కాయలే కాదు ఉసిరి గింజలతోనూ బోలెడు ప్రయోజనాలు ఉన్నాయి.
ఉసిరి కాయలో ఉండే పోషక విలువలు గింజల్లోనూ నిండి ఉంటాయి.
ఉసిరి గింజలను శుభ్రంగా కడిగి ఎండబెట్టి పొడి చేసుకుని స్టోర్ చేసుకున్నారంటే వివిధ రకాలుగా ఉపయోగించుకోవచ్చు.
నిత్యం ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో పావు టీ స్పూన్ ఉసిరి గింజల పొడి (Amla seed powder)కలిపి తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది.ఉసిరి గింజల్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది.
ఇది జీర్ణవ్యవస్థను మెరుగుపరచి గ్యాస్, అజీర్తి సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది.అదే సమయంలో పేగుల్లో వృద్ధి చెందే చెడు బ్యాక్టీరియాను తగ్గిస్తుంది.

ఉసిరి గింజల్లో ఉండే కొన్ని సహజ రసాయనాలు శరీరంలోని హానికరమైన టాక్సిన్లను బయటకు పంపుతాయి.బాడీని డీటాక్స్ చేస్తాయి.ఆరోగ్యకరమైన చర్మం, మృదువైన జుట్టును ప్రోత్సహిస్తాయి.అలాగే ఉసిరి గింజల పొడిని గోరు వెచ్చని నీటిలో కలిపి తాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో సహాయపడుతుందని కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి.
ఉసిరి గింజల్లో ఉండే న్యూట్రియంట్లు మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి కూడా మద్దతు ఇస్తాయి.

ఉసిరి గింజల పొడిని నూనెలో కలిపి తలకు పట్టిస్తే.జుట్టు కుదుళ్లు బలంగా మారతాయి.తలలో రక్త ప్రసరణను మెరుగుపడుతుంది.
జుట్టు రాలడం తగ్గు ముఖం పడుతుంది.అంతేకాకుండా ఉసిరి గింజల్లో యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు ఉంటాయి.
ఉసిరి గింజల పొడిని వాటర్ తో మిక్స్ చేసి చర్మంపై వాడితే, చర్మ సంబంధిత ఇన్ఫెక్షన్లను తగ్గించుకోవచ్చు.