రోజురోజుకీ మారుతున్న టెక్నాలజీ( Technology ) ప్రపంచంలో అత్యాధునిక సాంకేతికతకి సంబందించిన కోర్సులు చదవడం తప్పనిసరి అయిపోయింది.ఇదే క్రమంలో జనాభా పెరుగుదల, పోటీతత్వం కూడా విపరీతంగా ఉంది.
ఈ నేపథ్యంలో ఇతరుల కంటే ముందంజలో ఉండాలంటే ముఖ్యంగా 5 అత్యాధునిక సాంకేతికతను తప్పక నేర్చుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.లేకపోతే ఉద్యోగాలు( Jobs ) పొందడం సరికదా, చేస్తున్న ఉద్యోగాలను కాపాడుకోవడం కూడా చాలా కష్టతరం అవుతుందని హెచ్చరిస్తునారు.
అందులో ప్రధానమైనది “డేటా అనలిటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్.” డేటా అనలిటిక్స్,( Data Analytics ) ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) అనేవి వివిధ రంగాలను ప్రభావితం చేసే ప్రధాన అంశాలు.
ఈ రెండింటి ప్రాముఖ్యత గురించి మీరు ఈపాటికే తెలుసుకొనే వుంటారు.అయితే ఇకనుండి వాటి అవసరం మరింత పెరుగుతుంది.ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత విశ్లేషణలు సంస్థలు తమ డేటాను అర్థం చేసుకోవడంలో సహాయపడతాయి.ఈ సమాచారం ఆటోమేషన్ ప్రాసెస్ తో పాటు ప్రిడిక్టివ్ అనలిటిక్ లను తేలిక చేస్తాయి.
ఆ తరువాత వరుసలో వుంటుంది “ఎడ్జ్ కంప్యూటింగ్.”( Edge Computing ) రియల్ టైం డేటా ప్రాసెసింగ్ అవసరమైన సమయంలో ఎడ్జ్ కంప్యూటింగ్ అనేది సాంకేతికంగా చాలా ముఖ్యమైనదన్న సంగతి అందరికీ తెలిసినదే.ఇక 3వది “ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్.” ( Internet Of Things ) ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ పరిశ్రమలను స్మార్ట్ గా మార్చివేస్తుంది.ఈ ఏడాదిలో ఇంటర్నెంట్ ఆప్ థింగ్స్ మరింత విస్తరిస్తుంది.తరువాత “సుస్థిరమైన సాంకేతికత” గురించి మాట్లాడుకోవాలి.
ప్రతీ పరిశ్రమలో సుస్థిరమైన సాంకేతికత అనేది కీలకమైన అంశం.
ఈ సుస్థిర సాంకేతికత వ్యాపారాల్లో పర్యావరణ సంబంధిత కస్టమర్ల డిమాండ్లను నెరవేరుస్తాయి.చివరగా “5G టెక్నాలజీ”( 5G Technology ) గురించి చెప్పుకోవాలి.5జీ టెక్నాలజీ ప్రారంభంతో డేటా ట్రాన్స్ మిషన్, కనెక్టివిటీపై బలంగా ఆధారపడే సెక్టార్ లు పెరిగిపోయాయి.ఇక 5జీతో వేగవంతమైన ఇంటర్నెట్ తో రియల్ టైం కమ్యూనికేషన్ సాధ్యపడుతుంది.దాంతో ఏ ఉద్యోగి అయినా సదరు సంస్థలో విజయం సాధించాలంటే మారుతున్న కాలానికి తగ్గట్లు, రోజు రోజుకు పెరుగుతున్న సాంకేతికను అందిపుచ్చుకోవాల్సిందే అని నిపుణులు సూచిస్తున్నారు.