అమ్మవారిని దర్శించుకుంటే సంతాన భాగ్యం.. అమ్మవారి దర్శనం కోసం పులులు..

ముఖ్యంగా చెప్పాలంటే చైత్ర నవరాత్రుల( Chaitra Navratri ) సమయంలో దేశంలోని భక్తులు వివిధ దేవాలయాలకు వెళ్లి భగవంతుని దర్శించుకుని వస్తూ ఉంటారు.

అంతే కాకుండా దేశంలోని ప్రతి మూల ఏదో ఒక రూపంలో కొలువై ఉన్న తల్లి దీవెనల కోసం భారీగా భక్తులు తరలి వెళ్తుంటారు.

ముఖ్యంగా చెప్పాలంటే మధ్యప్రదేశ్ లోని నర్మదాపురం లో బంగ్లా ముఖి అమ్మవారి దేవాలయం( Bangla Mukhi Ammavari Temple ) చాలా ప్రాముఖ్యత కలిగి ఉంది.ఇక్కడ దేవాలయంలో తలకిందులుగా ఉన్న సింహం పై కూర్చుని తల్లి ఉంటుంది.

బంగ్లా ముఖి అమ్మవారి పురాతన దేవాలయంలో దేవత సింహం పై కూర్చుని ఉంటుంది.ఈ రోజుకి తాంత్రికులు ఇక్కడికి వచ్చి పూజలు చేస్తూ ఉంటారు.

ఇక్కడ జగదాంబ ( Jagadamba)రూపంలో ఉన్న బంగ్లా ముఖి మాత పురాతన విగ్రహం 175 సంవత్సరాల క్రితం అప్పటి పచ్‌మర్హి రాణి మహల్ జగదాంబ విగ్రహాన్ని స్థాపించింది.

Advertisement

ఇంకా చెప్పాలంటే దేవాలయంలోని అమ్మవారి విగ్రహాన్ని దర్శించుకోవడానికి ఈ రోజుకి పులులు ఇక్కడికి వస్తాయని చెబుతూ ఉంటారు.అమ్మవారు ప్రతి భక్తుని కోరికలను తీరుస్తుందని భక్తులు నమ్ముతారు.సంతానం కోసం దంపతులు ఇక్కడికి వస్తారని, వారి కోరికలు కూడా నెరవేరుతాయని చాలా మంది భక్తులు నమ్ముతారు.

దేవాలయం బయట ఒక రాయి ఉంటుంది.నవరాత్రులలో ఏదో ఒక రోజు అర్ధ రాత్రి పులి తప్పకుండా వస్తుంది.

తల్లిని చూడగానే తిరిగి వెళ్ళిపోతుంది.గుడి ముందు చాలా సార్లు పులి వచ్చినా అమ్మవారి దయ వల్ల అది భక్తులకు ఎటువంటి హానిచేయదని అక్కడి స్థానికులు చెబుతున్నారు.నిజానికి అమ్మవారికి సంబంధించి దేశంలోనే అనేక దేవాలయాల్లో ఏదో ఒక అద్భుతాలు జరుగుతూ ఉంటాయి.

అవి ఎందుకు జరుగుతాయి అన్నది ఇప్పటి వరకు అంతు పట్టని విషయం.

Mangalampalli Balamurali Krishna: మరో జన్మంటూ ఉంటె క్రికెటర్ గానే పుడతాడట....మనసులో మాట బయటపెట్టిన మహానుభావుడు.
Advertisement

తాజా వార్తలు